అబ్బురం.. సైన్స్ సంబరం
● జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో
300 ప్రాజెక్టులు
● అందరినీ ఆలోచింపజేసిన నమూనాలు
● సృజనాత్మకత పెంపొందించుకోవాలని
విద్యార్థులకు జేసీ సూచన
ఒంగోలు సిటీ:
చిట్టి మెదళ్లు గట్టి ఆలోచనలే చేశాయి. సమాజానికి ఉపయోగపడే ఆలోచనలకు ఆవిష్కరణల రూపమిచ్చాయి. ఉపాధ్యాయుల తోడ్పాటుతో ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులు శుక్రవారం జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డీఈఓ సీవీ రేణుక అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జేసీ గోపాలకృష్ణ హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 300 ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులు ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెంపొందించుకునేందుకు సైన్స్ ఫెయిర్ దోహదపడుతుందని జేసీ పేర్కొన్నారు. స్థానిక సమస్యలకు స్థానికంగా పరిష్కారాలు కనుగొనేలా ప్రాజెక్టులు తయారు చేయాలని సూచించారు. డీఈఓ రేణుక మాట్లాడుతూ.. విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి, అభిరుచిని పెంపొందించుకోవాలని సూచించారు. శాసీ్త్రయ దృక్పథంతో ప్రాజెక్టులు తయారు చేసి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై ప్రాజెక్టుల నమూనాలను తిలకించారు. కార్యక్రమంలో ఒంగోలు, మార్కాపురం డీవైఈఓలు చంద్రమౌళీశ్వరరావు, ఎం.శ్రీనివాసులు, డీసీఈబీ శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి టి.రమేష్, ఒంగోలు ఎంఈఓ టి.కిషోర్‌బాబు, ఒంగోలు ఎమ్మార్వో మధుసూదనరావు, ఇతర మండలాల ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కార్బన్ శుద్ధి చేసే పద్ధతిని
ప్రదర్శిస్తున్న వెలిగండ్ల జెడ్పీ స్కూల్ విద్యార్థి జితేంద్ర
హ్యూమన్ హార్ట్ పనితీరును ప్రదర్శిస్తున్న చిరికూరపాడు హైస్కూల్ బాలిక మృదుల
చార్జింగ్ షూను ప్రదర్శిస్తున్న మహ్మదాపురం జెడ్పీ స్కూల్ విద్యార్థి అజయ్
సెన్సార్ స్మార్ట్ బైక్‌తో చెన్నారెడ్డిపల్లె జెడ్పీ స్కూల్ బాలిక శ్రీదివ్య
అబ్బురం.. సైన్స్ సంబరం
అబ్బురం.. సైన్స్ సంబరం
అబ్బురం.. సైన్స్ సంబరం
అబ్బురం.. సైన్స్ సంబరం
అబ్బురం.. సైన్స్ సంబరం
అబ్బురం.. సైన్స్ సంబరం
అబ్బురం.. సైన్స్ సంబరం
అబ్బురం.. సైన్స్ సంబరం
అబ్బురం.. సైన్స్ సంబరం
అబ్బురం.. సైన్స్ సంబరం
అబ్బురం.. సైన్స్ సంబరం
అబ్బురం.. సైన్స్ సంబరం
అబ్బురం.. సైన్స్ సంబరం
అబ్బురం.. సైన్స్ సంబరం


