దప్పిక తీరాలంటే.. క్యాన్లు మోయాల!
బేస్తవారిపేట: స్థానిక బీసీ హాస్టల్లో విద్యార్థులు దప్పిక తీర్చుకోవాలంటే రోజూ మినరల్ వాటర్ బబుల్స్ స్వయంగా మోసుకొచ్చుకోవాల్సిందే. వార్డెన్ విధులకు సక్రమంగా హాజరు కాకుండా ఆయన కుమారుడికి హాస్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు మౌనం పాటించడంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. విద్యార్థులు రోజూ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆర్వో ప్లాంట్ వద్దకు వెళ్లి బబుల్స్‌లో మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నారు. విద్యార్థులతో రాత్రి సమయంలో వాటర్ క్యాన్లు మోయిస్తున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


