డీఎడ్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని బీఎడ్ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వైస్ ఛాన్సలర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎడ్ రెండో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి మొత్తం 11,340 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 93.88 ఉత్తీర్ణత శాతంతో 10,646 మంది పాసైనట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ సోమశేఖర, డీసీ అకడమిక్స్ ప్రొఫెసర్ జి.రాజమోహన్‌రావు, పరీక్షల కో ఆర్డినేటర్ డాక్టరు ఆర్.శ్రీనివాసులు, పరీక్షల విభాగం పర్యవేక్షకుడు సూడా శివరాం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు ఏకేవీకే డిగ్రీ కళాశాలలో శనివారం ఉద్యోగమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రెసిడెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ యువత తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాల గురించి ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ రమాదేవి వివరించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ మాట్లాడుతూ పట్టణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించడమే తమ లక్ష్యమన్నారు. జాబ్‌మేళలో మొత్తం 34 కంపెనీలు పాల్గొన్నట్లు తెలిపారు. వీటికి 515 మంది హాజరుకాగా, 329 మంది ఎంపికయ్యారన్నారు.
డీఎడ్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల


