క్రమశిక్షణ.. ఎన్‌సీసీ..!
జూనియర్ డివిజన్ బాలురు (జేడీ),
జూనియర్ డివిజన్ బాలికలు (జేడబ్ల్యూ)
28 మందికి రూ.8 వేలు, ఎస్‌డీ,
ఎస్‌డబ్ల్యూలు 15 మందికి రూ.5 వేలు ఇస్తారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో
చేరడానికి ఒక శాతం, మెడికల్ సీట్లలో 0.25 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
కంభం:
విద్యార్థుల్లో చదువుతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించి సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో నేషనల్ క్యాడెట్ కార్‌ప్స్ (ఎన్‌సీసీ) కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్‌సీసీలో చేరి శిక్షణ పొందడం ద్వారా ఆర్మీ, పోలీస్, తదితర ఉద్యోగాలతో పాటు ఉన్నత చదువుల్లో కూడా రిజర్వేషన్ల సౌకర్యం ఉండటంతో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పారామిలటరీ రిక్రూట్‌మెంట్‌లో ఎన్‌సీసీ విద్యార్థులకు ‘ఎ’ సర్టిఫికెట్‌కు–2, ‘బి’ సర్టిఫికెట్‌కు–6, ‘సి’ సర్టిఫికెట్‌కు 10 మార్కులు కలుస్తాయి. ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరడానికి ఒకశాతం, మెడికల్ సీట్లలో 0.25 శాతం రిజర్వేషన్ ఉంటుంది. జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో అధికంగా సైనిక కుటుంబాలు ఉండటంతో వారి పిల్లలు ఎన్‌సీసీలో ఎక్కువగా చేరుతున్నారు. ఆడపిల్లలు సైతం పోటీపడి మరీ ఎన్‌సీసీలో చేరి సర్టిఫికెట్లు పొందుతున్నారు. జిల్లాలో 34 ఆంధ్రా బెటాలియన్‌లో 3 వేల మంది ఎన్‌సీసీ విద్యార్థులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా బీ, సీ సర్టిఫికెట్లు పొందేందుకు కాలేజీ స్థాయి విద్యార్థులకు ఒంగోలు, చీరాల, మార్కాపురం, కందుకూరు, నెల్లూరులో క్యాడర్ క్యాంప్ జరుగుతోంది. ఎన్‌సీసీ విద్యార్థులకు పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే ‘ఎ’ సర్టిఫికెట్ వస్తే, ఇంటర్ మొదటి సంవత్సరంలో ‘బి’ సర్టిఫికెట్ తెచ్చుకునేందుకు ఎన్‌సీసీలో చేరవచ్చు. ఒకవేళ ‘ఎ’ సర్టిఫికెట్ లేకపోతే నేరుగా ‘బి’ సర్టిఫికెటు కోసం చేరవచ్చు. ‘ఎ’ సర్టిఫికెటు పరీక్షకు హాజరుకావాలంటే కచ్చితంగా 40 రోజుల శిక్షణ తీసుకోవాలి. ప్రతి ఏటా నవంబర్ నెలలో నాలుగో ఆదివారం ఎన్‌సీసీ దినోత్సవం జరుపుకుంటారు.
ఎన్‌సీసీ శిక్షణతో ఎన్నో ప్రయోజనాలు
క్రమశిక్షణ, దేశభక్తితో పాటు విద్య, ఉద్యోగాలలో అదనపు రిజర్వేషన్లు
34 ఆంధ్రా బెటాలియన్ కింద జిల్లాలో 3 వేలమందికిపైగా ఎన్‌సీసీ విద్యార్థులు
5 ఇంజినీరింగ్ కళాశాలలు, 7 కళాశాలలు, 35 హైస్కూళ్లలో ఎన్‌సీసీ శిక్షణ
బంగారు భవిష్యత్ ఉండటంతో ఆసక్తి చూపుతున్న విద్యార్థులు
నేడు ఎన్‌సీసీ దినోత్సవం


