
రిజర్వేషన్లకు గండి
జిల్లాలో మొత్తం 10 మార్కెట్ యార్డులున్నాయి. అందులో ఐదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు కేటాయిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా లాటరీ ద్వారా రిజర్వేషన్ నిర్ణయించారు. యర్రగొండపాలెం ఎస్టీ, దర్శి, కనిగిరి ఎస్సీ, పొదిలి మైనార్టీ మహిళ, ఒంగోలు, గిద్దలూరు బీసీ జనరల్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఓపెన్ కేటగిరీలో కేటాయించిన చైర్మన్ పదవులను వారితోనే భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం రిజర్వేషన్ స్థానాల్లో మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా అగ్రకులాలకు కేటాయించింది. ఎస్సీకి కేటాయించిన దర్శిలో దారం నాగవేణి (కాపు), కనిగిరిలో ఎస్సీకి బదులుగా ఏరువ రమాదేవి (కమ్మ), ఎస్టీకి కేటాయించిన యర్రగొండపాలెంలో చేకూరి సుబ్బారావు (కమ్మ), మైనార్టీ మహిళకు కేటాయించిన పొదిలి మార్కెట్ యార్డు పదవి షేక్ ఇమాంసాహెబ్ (మైనారిటీ పురుషుడు) కేటాయించారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే అవుతుందని, దీని వల్ల రిజర్వేషన్ వర్గాలకు రాజ్యాంగం కల్పించి అవకాశం దక్కకుండా పోతుందని ఆరె రమణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అధికారం చేతిలో ఉంది కదాని ప్రభుత్వం అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సమర్ధించుకోలేక సతమతమవుతోంది.

రిజర్వేషన్లకు గండి