
మార్కాపురం: నాటుబాంబు కొరికి కుక్క మృతిచెందిన ఘటన మార్కాపురం మండలం గోగులదిన్నెలో శనివారం జరిగింది. పోలీసు కథనం మేరకు గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలోని ఖాళీ స్థలంలో ఉన్న నాటుబాంబును తినే పదార్థం అనుకుని కుక్క నోటపట్టుకుని వచ్చి రోడ్డుపై కొరికింది. దీంతో పెద్ద శబ్దంతో బాంబు పేలడంతో కుక్క తల ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది. భారీ శబ్దం రావడంతో గ్రామస్తులంతా ఉలిక్కిపడి ఘటనా స్థలానికి చేరకున్నారు. సమీపంలో ఇంకా ఏమైనా ఉన్నాయా అని వెతికారు. సమాచారం అందుకున్న మార్కాపురం రూరల్ ఎస్సై అంకమరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పందుల కోసం ఎవరైనా నాటుంబాబు పెట్టి ఉండవచ్చని భావిస్తున్నామని ఎస్సై తెలిపారు.