
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఒంగోలు టౌన్: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నగరంలోని పలు ప్రైవేటు అస్పత్రులు, స్కానింగ్ సెంటర్లను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రుల రికార్డులు పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. వాటి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రులను నిర్వహించే వారంతా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అల్లోపతి క్లినికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 2002 ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించారు. పొల్యూషన్, ఫైర్, బయోమెడికల్ వేస్టేజీ అనుమతి పత్రాలు ఉండాలని చెప్పారు. ఆస్పత్రిలో అందిస్తున్న సేవలు, వాటి ఫీజుల వివరాలు తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఓపీ రిజిస్టర్, కేసు షీట్లు, ఇతర రిజిస్టర్‌లు నిర్వహించాలని చెప్పారు. తనిఖీల్లో డాక్టర్ శ్రావణ్‌కుమార్, మాస్ మీడియా అధికారి డి.శ్రీనివాసులు పాల్గొన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులకు డీఎంహెచ్‌ఓ హెచ్చరిక