
అక్రమంగానే భవన నిర్మాణం పూర్తి...
ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాన్ అప్రూవల్‌ను తిరస్కరించారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతే కమర్షియల్ కాంప్లెక్స్‌ను హైదరీ క్లబ్ కమిటీ నిర్మించాల్సి ఉంది. కానీ, అలాంటిదేమీ లేకుండానే నగరం నడిబొడ్డులో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకపోయినా రోడ్డు మీదనే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తుంటే ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌గానీ, టౌన్ ప్లానింగ్ అధికారులుగానీ కనీసం దానివైపు కనె ్నత్తి కూడా చూడలేదు. అడ్డగోలుగా అక్రమంగా అంత పెద్ద భవన నిర్మాణం జరుగుతుంటే కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప ఆ నిర్మాణాన్ని నిలువరించే ప్రయత్నం కనీసం కూడా చేయలేదు.