
సీపీఐ భారీ ర్యాలీ
ఒంగోలు టౌన్: సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు శనివారం ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చారు. తొలుత కార్యకర్తలతో నెల్లూరు రోడ్డులోని మినీ స్టేడియం నుంచి ర్యాలీ బయలుదేరి ఊరచెరువులోని సభాస్థలికి చేరుకున్నారు. ర్యాలీలో సంప్రదాయ వేషధారణలతో వచ్చిన కార్యకర్తలు ఆకట్టుకున్నారు. విప్లవ వీరుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సినీ హీరో మాదాల రవి, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు పీజీ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెల్లి విల్సన్, హరినాథ్ రెడ్డి, జి.ఓబులేసు, కెవివి ప్రసాద్, అజయ్ కుమార్, జగదీష్, రామచంద్రయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, డేగ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
మహాసభ ర్యాలీకి సీపీఎం ఘన స్వాగతం:
సీపీఐ రాష్ట్ర మహాసభల ర్యాలీకి సీపీఎం ఘనస్వాగతం పలికింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండు నుంచి తరలివచ్చిన ర్యాలీకి స్థానిక సాగర్ సెంటర్ వద్ద సీపీఎం నాయకులు పూలు చల్లి, కరచాలనం చేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు, జిల్లా నాయకులు జీవీ కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, కాలం సుబ్బారావు, కె.రమాదేవి, పి.కల్పన, పమిడి వెంకటరావు, దామా శ్రీనివాసరావు, బి.రఘురాం, అమీర్, నారాయణ తదితరులు ఉన్నారు.