
ప్రజల్లో మూఢ నమ్మకాలు తొలగిస్తాం
మార్కాపురం: ప్రజల్లో మూఢ నమ్మకాలను తొలగించేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తుందని జేవీవీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికై న వెంకట్రావు తెలిపారు. యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జేవీవీ సమావేశంలో ఆయన్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో యూటీఎఫ్ నాయకుడు శ్రీరాములు మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు వెంకటేశ్వర్లు, కాశయ్య, శ్రీనివాసనాయక్, తదితరులు పాల్గొన్నారు.