
జాజితోటకు బొబ్బతెగులు సోకింది
ఏ మందులు వాడాలో తెలియడం లేదు
మల్లె తోటలకు ఎర్రమొగ్గ, నళ్లి తెగుళ్ల బెడద అధికంగా ఉంది. అధికారులెవరూ మల్లెతోటలను పరిశీలించేందుకు రావడం లేదు. తెగుళ్లకు ఏ మందులు వాడాలో తెలియక ఎరువుల కొట్లవారు ఏ మందు ఇస్తే అది కొనుగోలు చేసి పిచికారీ చేసుకుంటున్నాం. మా పూలతోటలను అధికారులు పరిశీలించి సూచనలిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
షేక్.ఖాసింవలి, రైతు
పెట్టుబడి
రావడం లేదు
పూలతోటలకు పెట్టిన పెట్టుబడులకు సరిపడా ఆదాయం కూడా రావడం లేదు. కూలీల ఖర్చులు పెరిగిపోయాయి. ఆరుగాలం శ్రమించి సాగుచేసుకున్న పంటకు తెగుళ్లు వ్యాపించి దిగుబడి తగ్గిపోవడంతో నష్టాలే మిగులుతున్నాయి. రానురానూ పూలతోటలు సాగుచేయాలంటే భయమేస్తోంది.
భువనగిరి శ్రీనివాసులు, రైతు
ఎకరా పొలంలోనే మల్లె సాగు
గతంలో నాలుగైదు ఎకరాల్లో పూల తోటలు సాగు చేసేవాడిని. ఖర్చులు పెరిగిపోవడం, తెగుళ్లతో దిగుబడులు తగ్గిపోతుండటంతో ప్రస్తుతం ఎకరా పొలంలోనే సాగు చేస్తున్నా.
పి.కరీముల్లా, మల్లె రైతు
0.70 సెంట్లలో జాజితోట సాగు చేస్తున్నా. జాజికి బొబ్బ తెగులు సోకి ఆకులు ముడతలు పడి పూలు కాయడం లేదు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాను. పెరిగిన పెట్టుబడులకు తోడు తెగుళ్ల బెడద అధికమవడంతో పూల తోటలు సాగుచేయాలంటేనే భయమేస్తోంది.
మద్దుకూరి తిరుపాలు

జాజితోటకు బొబ్బతెగులు సోకింది

జాజితోటకు బొబ్బతెగులు సోకింది

జాజితోటకు బొబ్బతెగులు సోకింది