
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక
ఒంగోలు: రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆదివారం స్థానిక గద్దలగుంటలోని ఎస్‌పీకేఆర్ ఓరియంటల్ పాఠశాలలో ఉత్సాహంగా నిర్వహించారు. ఎంపిక ప్రక్రియను యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.శివాజీ, కార్యదర్శి డి.కిరణ్మయి, పాఠశాల కరస్పాండెంట్ ఎం.కోటి సూర్యనారాయణ, హెచ్‌ఎం పద్మావతి, సీహెచ్ రామకృష్ణారావు, వి.ఆంజనేయులు, పీఈటీ సోమినేని సురేష్ పర్యవేక్షించారు. న్యాయ నిర్ణేతలుగా ప్రతిమ, మస్తాన్‌బీ, రమణయ్య, శంకర్రావు, వెంకటేశ్వర్లు, సురేష్ వ్యవహరించారు.
ఎంపికై న క్రీడాకారులు వీరే
8–10 సంవత్సరాల విభాగం
బాలురు: సీహెచ్ జస్వంత్–నేరేడుపల్లి(ప్రథమ),
సీహెచ్ నాగేంద్ర–నేరేడుపల్లి(ద్వితీయ)
బాలికలు: ఎస్.మోక్షిత–పెదచెర్లోపల్లి(ప్రథమ),
సీహెచ్ మానస– పెదచెర్లోపల్లి(ద్వితీయ)
10–12 సంవత్సరాల విభాగం
బాలురు: ఎ.తేజచరణ్– చందలూరు(ప్రథమ),
ఎన్.నిరీక్షణ్‌రావు–చందలూరు(ద్వితీయ)
బాలికలు: ఎన్.రత్నకుమారి–చందలూరు(ప్రథమ),
ఎం.షణ్ముఖ–ఒంగోలు(ద్వితీయ)
12–14 సంవత్సరాల విభాగం
బాలురు: ఎం.వెంకటేష్–చందలూరు(ప్రథమ),
ఎం.షణ్ముఖ–ఒంగోలు(ద్వితీయ)
బాలికలు: ఎన్.శృతి–చందలూరు(ప్రథమ),
ఎ.లిఖిత–చందలూరు(ద్వితీయ)
14–16 సంవత్సరాల విభాగం:
బాలురు: టి.సందీప్‌వర్మ–ఒంగోలు(ప్రథమ), వై.కళ్యాణ్‌రామ్–మద్దిపాడు(ద్వితీయ)
బాలికలు: వి.రజని–పామూరు(ప్రథమ),
కె.శరణ్య–ఒంగోలు(ద్వితీయ)
18–21 సంవత్సరాల విభాగం:
పురుషులు: సీహెచ్.శ్రీధర్–ఒంగోలు(ప్రథమ),
కె.ప్రణీత్–ఒంగోలు(ద్వితీయ)
మహిళలు: ఎన్.సాయిచందన–ఒంగోలు(ప్రథమ),
ఎ.ఉదయ సాయి శ్వేత–ఒంగోలు(ద్వితీయ)
21–25 సంవత్సరాలు:
పురుషులు: కె.శివకోటిరెడ్డి–కోరలమడుగు(ప్రథమ)
35–45 సంవత్సరాల విభాగం:
మహిళలు: బి.ప్రశాంతి–ఒంగోలు(ప్రథమ)
45 సంవత్సరాల పైన:
పురుషులు: కె.శంకరరావు–ఉప్పుగుండూరు(ప్రథమ), ఎస్‌వీ రమణయ్య–కనిగిరి(ద్వితీయ)

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక