ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
దర్శి(కురిచేడు): భర్త మందలించాడని మనస్తాపం చెందిన మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దర్శి మండలంలోని తూర్పు వీరాయపాలెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై మురళి కథనం మేరకు.. తూర్పువీరాయపాలెం గ్రామానికి చెందిన చెరుగూరి వెంకటరత్నం(30)ను సోమవారం రాత్రి అన్నం వండే విషయమై ఆమె భర్త బాల సుందరరాజు మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం వేకువ జామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని, మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


