కురిచేడు చేరిన సాగర్ జలాలు
కురిచేడు: జిల్లా ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేసిన సాగర్ జలాలు సోమవారం కురిచేడు చేరాయి. పది రోజులపాటు సరఫరా అయ్యే ఈ నీటితో రక్షిత నీటి పథకాల చెరువులను నింపాల్సి ఉందని, చేపల చెరువులు, నాన్ నోటిఫైడ్ చెరువులకు మళ్లిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్‌ఎస్పీ డీఈఈ అక్బర్‌బాషా హెచ్చరించారు. సాగర్ ప్రధాన కాలువపై 9 రక్షిత నీటి పథకాలు ఉన్నట్లు తెలిపారు. సాగర్ డ్యాం వద్ద 5,500 క్యూసెక్కులు, 85/3 మైలు జిల్లా సరిహద్దు వద్ద 1793 క్యూసెక్కులు, దర్శి బ్రాంచి కాలువ హెడ్ రెగ్యులేటర్ 126వ మైలు కురిచేడు వద్ద 884 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోందని వివరించారు.


