సీనియర్‌ అసిస్టెంట్‌కు పదోన్నతి కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ అసిస్టెంట్‌కు పదోన్నతి కల్పించాలి

May 3 2025 8:25 AM | Updated on May 3 2025 8:25 AM

సీనియర్‌ అసిస్టెంట్‌కు పదోన్నతి కల్పించాలి

సీనియర్‌ అసిస్టెంట్‌కు పదోన్నతి కల్పించాలి

ఒంగోలు సిటీ: జిల్లాలో అర్హులైన జూనియర్‌ అసిస్టెంట్‌లకు సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించాల్సిందిగా డీఈవో కిరణ్‌కుమార్‌కు ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వి.శివలీల శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లా (పాత జిల్లా పరిధి)లో ఆరు నెలలుగా సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌ ఖాళీగా ఉందన్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌కు సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ పీ.వెంకటేశ్వర్లు, జనరల్‌ సెక్రటరీ చైతన్య, కోశాధికారి ఎస్‌.పేరయ్య ఉన్నారు.

కిశోర బాలల రక్షణ ప్రధానం

కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియా

ఒంగోలు సబర్బన్‌: కిశోర బాలల రక్షణ చర్యలు ప్రధాన అజెండాగా పెట్టుకోవాలని కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియా పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ కమిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కిశోర వికాసం పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ బాలికలు, బాలురు 11 నుంచి 18 సంవత్సరాల వయస్సున్న వారిని అభివృద్ధి చేయటమే కిశోర వికాసం లక్ష్యమన్నారు. వారి రక్షణ, సాధికారతను పెంపొందించడం, బాల్య వివాహాలను అడ్డుకోవటం, ఆరోగ్యం, విద్య, పోషణ నైపుణ్యాలు, భద్రత, ఉపాధికి అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారిత అధికారి బి.హేన సుజన, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్‌ కుమార్‌, వెంకటేశ్వర్లు, కిరణ్‌ కుమార్‌, సునీల్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

4వ రోజుకు చేరిన సీహెచ్‌ఓల సమ్మె

ఒంగోలు టౌన్‌: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలుఅందిస్తున్న విలేజి క్లినిక్‌ల్లో పనిచేస్తున్న సీహెచ్‌ఓల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరింది. జిల్లాలోని 538 మంది సీహెచ్‌ఓలు ఈ సమ్మెలో పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామని ఏపీఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యం.రాజేష్‌ తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా శాంతియుత నిరసనలు కొనసాగిస్తామన్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగులతో సమానంగా తమకు ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ నుంచి మినహాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షురాలు నిర్మల, కార్యదర్శి ప్రసన్న, కో ఆర్డినేటర్‌ దీప్తి, కామేష్‌, నవీన్‌, రామాంజనేయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement