ఉరేసుకుని కార్మికుడు మృతి
కనిగిరి రూరల్: పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికుడు ఉరేసుకుని మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి కనిగిరి మండలంలోని వంగపాడు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వంగపాడు సమీపంలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో మెగా బేస్ క్యాంప్‌లో టిప్పర్ డ్రైవర్‌గా పశ్చిమబెంగాల్ రాష్ట్రం నసర్తాపూర్‌కు చెందిన హరిదయ రతన్‌దాస్ (49) పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబ కలహాలు, సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బేస్ క్యాంప్‌లోని షెడ్ ఇనుప రాడ్డుకు నైలాన్ తాడుతో ఉరివేసుకుని మృతిచెందాడు. ఆ మేరకు బేస్ క్యాంప్ పీఆర్‌ఓ ముండ్రు వినయ్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మృతదేహాన్ని కనిగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మార్కాపురం డివిజన్
పంచాయతీ అధికారిగా భాస్కర్‌రెడ్డి
మార్కాపురం: మార్కాపురం డివిజన్ పంచాయతీ అధికారిగా ఎంవీ భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన పల్నాడులో పంచాయతీ అధికారిగా పనిచేస్తూ బదిలీపై మార్కాపురం డివిజన్‌లో నియమితులయ్యారు. ప్రస్తుతం ఇన్‌చార్జి డీఎల్‌పీఓగా వై.భాగ్యవతి వ్యవహరిస్తున్నారు.


