మద్యం వాహనం బోల్తా
పొదిలి రూరల్: మండలంలోని సలకనూతల సమీపంలో మద్యం తరలించే వాహనం బోల్తాపడింది. దీంతో వాహనంలో ఉన్న మద్యం బాటిళ్లు కొన్ని పగిలిపోయాయి. మార్కాపురం నుంచి దర్శికి మద్యం లోడులో వెళుతున్న వాహనం ప్రమాదానికి గురై బోల్తా పడింది. అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. మద్యం బాటిళ్లు రోడ్డుపై చిందరవందరగా పడడంతో బాటిళ్లు కోసం కొంతమంది ఎగబడ్డారు. ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
కుక్కల దాడిలో
15 గొర్రెల మృతి
తర్లుపాడు: కుక్కల దాడిలో 15 గొర్రెల మృతి చెందాయి. ఈ సంఘటన మండలంలోని గానుగపెంటలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. బాధితుడు అమ్మనబ్రోలు శ్రీను తెలిపిన వివరాల మేరకు..గ్రామ శివారులోని దొడ్లో మధ్యాహ్నం సమయంలో గొర్రెలను తోలి ఇంటికివచ్చిన సమయంలో కుక్కలు దాడి చేసి చంపినట్లు తెలిపారు. సుమారు రూ.1.20 లక్షల నష్టం జరిగినట్లు వివరించారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా గ్రామంలో గత నెలలో కూడా కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందాయి. గ్రామంలో ఎక్కువగా గొర్రెలు పెంచుకుంటూ పలువురు జీవనాధారం సాగిస్తున్నారు. పంచాయతీ, వెటర్నరీ అధికారులు జోక్యం చేసుకుని కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించాలని సర్పంచ్ పుచ్చకాయల బాలయ్య కోరారు.
వ్యాధుల పట్ల
అప్రమత్తత అవసరం
కొత్తపట్నం: మలేరియా, డెంగీ వా్య్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి మధుసూదనరావు అన్నారు. స్థానిక పీహెచ్‌సీని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మలేరియా, డెంగీ వ్యాధుల గురించి రికార్డులు పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి డాక్టర్ రమ్యదీపికకు వివరించారు. ఏఎన్‌ఎంలు మలేరియా జ్వరాలను ఎలా గుర్తించారు, వారు సేకరించిన రక్త పూత నమూనాలు పరిశీలించారు. దోమల నివారణ చర్యలు, దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. జ్వరం వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ వ్యక్తిని జ్వరం తగ్గే వరకు నిఘా ఉంచాలన్నారు. డాక్టర్ రమ్య దీపిక, సబ్ యూనిట్ ఆఫీసర్ సాగర్, పి.శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, పీహెచ్ సూపర్‌వైజర్ పి.ప్రభాకర్, హెచ్‌వీ సులోచన తదితరులు పాల్గోన్నారు.
170 బస్తాల
రేషన్ బియ్యం పట్టివేత
దొనకొండ:
గ్రామాల్లో రేషన్ డీలర్ల వద్ద కొనుగోలు చేసి నిల్వ చేసిన 170 బస్తాల రేషన్ బియ్యాన్ని ఒంగోలు విజిలెన్స్ సీఐ రవిబాబు, ఎస్సై నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..దొనకొండకు చెందిన మాడిశెట్టి నారాయణ గ్రామాల్లోని రేషన్ డీలర్ల వద్ద బియ్యాన్ని కొనుగోలు చేసి స్థానిక బ్రాహ్మరావుపేటలోని సాయిబాబా గుడి సమీపంలో మాదాల రాము ఇంట్లో నిల్వ చేశాడు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం విజిలెన్స్ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రాధాక్రిష్ణకు సమాచారం అందజేశారు. బియ్యాన్ని గోడౌన్‌కు తరలించి డీటీ షేక్ సుష్మాకు అప్పగించారు. నారాయణపై 6ఏ కేసు నమోదు చేశారు.
మద్యం వాహనం బోల్తా
మద్యం వాహనం బోల్తా
మద్యం వాహనం బోల్తా


