బీచ్ కబడ్డీ ఉమ్మడి ప్రకాశం జిల్లా పురుషుల జట్టు ఎంపిక
చినగంజాం: బీచ్ కబడ్డీ ఉమ్మడి ప్రకాశం జిల్లా పురుషుల జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం స్థానిక ఎంఎస్‌ఆర్ జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహించారు. మే నెల 2 వ తేదీ నుంచి కాకినాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు పాల్గొననున్నట్లు అంతర్జాతీయ క్రీడాకారుడు, కోచ్ ఎం.గిరిబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా నుంచి పోటీల్లో పాల్గొనే సీ్త్ర, పురుషుల జట్టులకు ప్రయాణపు ఖర్చులు, ఇతర ఖర్చులు చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. చినగంజాం గ్రామంలో గత 15 సంవత్సరాలుగా స్వచ్చందంగా కబడ్డీ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్న బాలకోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు మరపాల గిరిబాబు, క్లబ్ కార్యవర్గ సభ్యులను ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. బీచ్ కబడ్డీ జట్టు ఎంపిక కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ ఎన్ చంద్రమోహన రెడ్డి, ప్రెసిడెంట్ కుర్రా భాస్కరరావు, కార్యదర్శి వై పూర్ణచంద్రరావు, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, ట్రజరర్ డీ రమేష్, బీ నాగాంజనేయులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పురుషుల జట్టు ఇదీ..
గాలి లక్ష్మారెడ్డి, జీ సమరసింహారెడ్డి, జీ బాలకృష్ణారెడ్డి, కే వెంకటేష్, వై రాజశేఖర్ రెడ్డి, కే ప్రసాద రెడ్డి, బీ భరత్ రెడ్డి, కే హరిప్రసాద్‌రెడ్డి, కే రామాంజిరెడ్డి, జీ లక్ష్మారెడ్డి, పీ బ్రహ్మారెడ్డి, బీ సురేష్ రెడ్డి, ఎన్ ఉమామహేశ్వరరావు, పీ వినీత్ రెడ్డి, కే బ్రహ్మయ్య, కోచ్ యం గిరిబాబు, మేనేజర్ బోగిరెడ్డి నాగాంజనేయులు రెడ్డి.


