రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

Jul 12 2024 1:28 AM | Updated on Jun 23 2026 4:14 PM

పెద్దారవీడు: ఆటో, ద్విచక్రవాహనం ఢీకొట్టంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలో తోకపల్లి గ్రామ సమీపంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...యర్రగొండపాలెం మండలం అమనిగుడిపాడు గ్రామానికి చెందిన చేవూరి సుబ్రమణ్యాచారి, బ్రహ్మచారి, గంగాదేవిలు కలిసి ఆటో మాట్లాడుకొని వ్యక్తిగత పనులపై మార్కాపురం పట్టణానికి బయలుదేరారు. యర్రగొండపాలెం మండలం గంగుపల్లి గ్రామానికి చెందిన దేశావత్‌ రామాంజినాయక్‌ ద్విచక్రవాహనంపై మార్కాపురం నుంచి సొంత గ్రామానికి వెళ్తున్నారు. జాతీయ రహదారి తోకపల్లి గ్రామ సమీపంలోకి రాగానే రెండు వాహనాలు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న చేవూరి సుబ్రహ్మణ్యాచారి, బ్రహ్మచారి, గంగాదేవి, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రామాంజినాయక్‌లకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయాలైన నలుగురిని మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్ల సలహా మేరకు తీవ్రగాయాలైన బ్రహ్మచారిని మేరుగైన వైద్యం అందించేందుకు గూంటూరు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement