
గంటలోపే సర్టిఫికెట్లు అందజేశారు
జగనన్న సురక్ష క్యాంపుల్లో నాకు అవసరమైన సర్టిఫికెట్లు అన్నీ అందజేశారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది నా నుంచి వివరాలు తీసుకొని గంటలోపే కుల ధ్రువీకరణ, ఇన్‌కం సర్టిఫికెట్లతో పాటు పొలం అడంగల్, వన్‌బీ పత్రాలను అందజేశారు. గతంలో ఇలాంటి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకొని రోజుల తరబడి పనులు వదిలేసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా గంటలోపే నాకు పత్రాలు అందజేశారు. గత పాలకులకు భిన్నంగా సీఎం జగన్ ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.
– నక్కా లక్షమ్మ, చౌటపాలెం, పొన్నలూరు మండలం
జగనన్న కాలనీలో ఇల్లు వచ్చింది
మాకు ఇద్దరు పిల్లలు. భర్త కూలి పనులు చేస్తుంటారు. ఇప్పటి వరకూ మాకు సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటిలోనే నివాసముంటున్నాం. జగనన్న ప్రభుత్వంలో పట్టణ శివార్లలోని చెన్నరాయునిపల్లి లేఅవుట్‌లో మాకు ఇల్లు వచ్చింది. ఇల్లు కట్టుకోవడంతో పూర్తికావచ్చింది. ఇన్నాళ్లకు మా కల నెరవేరింది. త్వరలో సొంత ఇంటిలోకి వెళ్తాం.
– ఏ.లక్ష్మి, బాపూజీ కాలనీ,
మార్కాపురం
వైఎస్సార్ చేయూతతో జీవితానికి భరోసా ఇచ్చారు
నా భర్త టైలర్. భర్త సంపాదనతోనే కుటుంబం గడవాల్సిన పరిస్థితి. జగనన్న రెండు విడుతల్లో ఇచ్చిన వైఎస్సార్ చేయూతను సద్వినియోగం చేసుకున్నాను. ఇంట్లోనే చిల్లర కొట్టు పెట్టుకున్నాను. డ్వాక్రా రుణమాఫీ, జీరో వడ్డీ, జగనన్న తోడు పథకాలు వచ్చాయి. మాలాంటి మహిళలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. మా కుటుంబానికి జగనన్న అండగా నిలిచారు. నెలకు రూ.10 వేలకు తక్కువ కాకుండానే ఆదాయం వస్తుంది.
– షేక్ హస్మత్, చింతలపాలెం
సొంత ఇల్లు నిర్మించుకున్నా
నాకు సొంత ఇల్లు లేకపోవడంతో గ్రామంలో అద్దెకు ఇల్లు తీసుకొని నివాసముంటున్నాను. వయస్సు పైబడటంతో కూలి పనులకు కూడా వెళ్లలేక, ఇంటి అద్దె కట్టలేక కొన్నేళ్లుగా నానా అవస్థలు పడ్డాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యాన నాకు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశారు. దీంతో నేను కొత్తగా గృహాన్ని నిర్మించుకున్నా. ఆ ఇంటిని కలెక్టర్ దినేష్‌కుమార్ చేతుల మీదగా ప్రారంభించారు. సీఎం జగన్‌కి నా కుటుంబం రుణపడి ఉంటుంది.
– తన్నీరు రమణమ్మ, పొన్నలూరు



