రైతులను బర్బాద్‌ చేస్తున్న సర్కారిది 

YSRTP YS Sharmila Slams BRS Party On Her Padayatra - Sakshi

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల 

రఘునాథపల్లి: ‘అబ్‌కి బార్‌ కిసాన్‌ సర్కార్‌ కాదు.. తెలంగాణలో రైతులను బర్బాద్‌ చేస్తున్న సర్కారు మీది’.. అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా విద్యుత్‌ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో ఆమె రఘునాథపల్లి సబ్‌స్టేషన్‌ ఎదుట వరంగల్‌– హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని కేసీఆర్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కరెంట్‌ కోతలు లేని పాలన అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top