
తాడేపల్లి : గత ఏడాది ఉగాది పండుగనాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ఎన్నో మాయమాటలు చెప్పి వాలంటీర్లను ముంచేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ విమర్శించారు. ఈరోజు(ఆదివారం) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధానకార్యాలయం నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన పుత్తా శివశంకర్.. గత ఉగాది నాడు చంద్రబాబు, పవన్‌లు ప్రజల్ని ఎలా నమ్మించి మోసం చేశారనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. ఇద్దరూ కలిసి వాలంటీర్లను నిలువునా గొంతుకోసేశారు.
గత ఉగాది పండుగ నాడు వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుది. ‘‘ మీ అన్నగా చెప్తున్నా’ ’నంటూ పవన్ సైతం వాలంటీర్లకు పదివేల జీతం హామీ ఇచ్చారు. వారికి లక్ష రూపాయల వరకూ సంపాదించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. మరి ఇప్పుడు ఆ హామీ సంగతిని పక్కన పెడితే.. ఇప్పుడేమో అసలు వాలంటీర్ల వ్యవస్థే లేదంటున్నారు. వాలంటీర్లను విజయవాడ వరదలప్పుడు వాడుకున్నది ఎవరు?, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలన రెండున్నర లక్షల వాలంటీర్ల కుటుంబాలు రోడ్డును పడ్డాయి. రోడ్డున పడిన వాలంటీర్ల కుటుంబాలను ఆదుకోవాలి’ అని పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు.