
తట్టుకోలేకపోతున్న చిట్టిబాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు
బాబు అండ్ కో అమరావతి దోపిడీని ‘ఎక్స్’లో ఎండగట్టిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్ కన్సార్షియం పేరుతో చంద్రబాబు, ఆయన బినామీల దోపిడీ బాగోతాన్ని సాక్ష్యాధారాలతో రట్టు చేస్తూ ‘ఎక్స్’లో వైఎస్సార్‌సీపీ మంగళవారం పోస్టు చేసింది. ‘గతంలో 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసింది.
రాజధానిలో రూ.లక్ష కోట్లు దోచుకున్న చంద్రబాబు అండ్ గ్యాంగ్ రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో అదేస్థాయి దోపిడీకీ బరితెగిస్తూ సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.18,221.9 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వచ్చే ఆదాయం 8.7 శాతం, అదే పెట్టుబడి పెట్టే చంద్రబాబు బినామీలతో కూడిన సింగపూర్ కన్సార్షియంకు వచ్చే ఆదాయం 91.3 శాతం. ఇది కుంభకోణం కాదా!’ అని వైఎస్సార్‌సీపీ నిలదీసింది. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో ఈ కుంభకోణం గుట్టురట్టవుతుందని, అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలవుతామన్న భయంతో సింగపూర్ సంస్థల కన్సార్షియం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని 2019 అక్టోబర్ 30న ప్రభుత్వాన్ని కోరింది.
సింగపూర్ సంస్థల కన్సార్షియం అభ్యర్థన మేరకు ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని వైఎస్సార్‌సీపీ గుర్తు చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పునరుద్ధరణకు సింగపూర్ సంస్థ కన్సార్షియం ముందుకు రాకపోవడంతో తన దోపిడీకి అడ్డుకట్ట పడిందన్న అక్కసుతో చంద్రబాబు గ్యాంగ్ యథావిధిగా దుష్ప్రచారం చేస్తోందని పేర్కొంది. అవినీతి చక్రవర్తి సీబీఎన్‌తో కలవలేమని సింగపూర్ చెప్పడంతో తట్టుకోలేక చిట్టిబాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పిచ్చెక్కి ఊగిపోతున్నాయని, బాబుతో ‘నో’ అంటూ సింగపూర్ మంత్రి ప్రకటన తర్వాత తెలుగు దొంగల పార్టీ సోషల్ సైకోల వికృత, విచిత్ర, ఉన్మాద విన్యాసాలు, కట్టుకథలు, తప్పుడు ప్రచారాలతో మొదలెట్టేశాయంది. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టుం సింగపూర్ పేరుతో బాబు అవినీతి కథలో పాత్రలు, పాత్రధారులతో సహా వాస్తవాలను 14 పాయింట్లతో వైఎస్సార్‌సీపీ ‘ఎక్స్’లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది.
వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ వేదికగా.. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు… సింగపూర్ పేరుతో బాబు అవినీతి కథలో పాత్రలు, పాత్రధారులు.. వాస్తవాలు ఇవీ:
తెలుగు దొంగల పార్టీ అధినేత, స్కాముల రారాజు చంద్రబాబును చూసి ఏకంగా దేశాలే బెంబేలెత్తిపోతున్నాయి. అమరావతి పేరిట చంద్రబాబు దోపిడీని చూసి ఇప్పుడు సింగపూర్ కూడా ఆ మరక మాకొద్దని ససేమిరా అంది. అమరావతి పునాదులను కుంభకోణాలు, స్కాంలతో మొదలుపెట్టిన చంద్రబాబు, ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తుండడంతో చంద్రబాబు ప్రతిపాదనలకు నో అంటూ ఆయన ముఖంమీదే సింగపూర్ చెప్పేసింది. దయచేసి తమను ఆ గబ్బులోకి లాగొద్దని చెంప చెళ్లుమనిపించేలా తన వైఖరిని స్పష్టంచేసింది. నీకో నమస్కారం అంటూ దండం పెట్టేసింది. 2018లో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి ఇప్పుడు కూడా జోరుగా సాగుతుండడం సింగపూర్ సర్కార్ దృష్టిలోనే ఉంది. దీనికి సాక్ష్యంగా తమదేశానికి చెందిన మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వరన్ జైలుపాలైన సంగతిని వాళ్లింకా మరిచిపోలేదు.
మరోవైపు 2018 నాటి అంచనాలను విపరీతంగా పెంచి, అమరావతిలో రెండో దఫా దోపిడీకి చంద్రబాబు చేస్తున్న స్కాంలు కూడా సింగపూర్ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. అమరావతిలో భూమి ప్రభుత్వానిది అయినా, ఇసుక ఉచితం అయినా, నిర్మాణ ఖర్చులు 2018తో పోలిస్తే పెరుగుదల లేకపోయినా భారీగా అంచనాలు పెంచి దోచేస్తున్న తీరుతో ఈ అవినీతి వ్యవహారంలోకి అడుగుపెట్టలేమని చెప్పేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు సుమారు రూ.9 -10వేలు ఖర్చు చేస్తున్న తీరుపై, ఆరేట్లు చూసి వాళ్లే దిగ్భ్రాంతి చెందారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అందుకనే బాబు అంటేనే భయపడుతున్నాయి.
💣Truth Bomb 💣
Must Read ❗
అవినీతి చక్రవర్తి @ncbn తో కలవలేమన్న సింగపూర్
తట్టుకోలేక పిచ్చెక్కి ఊగిపోతున్న చిట్టిబాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు
బాబుతో నో అంటూ సింగపూర్ మంత్రి ప్రకటన తర్వాత కట్టు కథలు, తప్పుడు ప్రచారాలు
తెలుగు దొంగలపార్టీ సోషల్ సైకోల వికృత, విచిత్ర, ఉన్మాద… pic.twitter.com/MrzRYFxB8S— YSR Congress Party (@YSRCParty) July 29, 2025
వాస్తవం ఏంటేంటే.. సింగపూర్ పేరు చెప్పి చంద్రబాబు చెప్పిన అవినీతి కథ ఏంటంటే?
1.అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియా 1691 ఎకరాలు. దీని అభివృద్ధి పేరిట చంద్రబాబు వేలకోట్ల అవినీతికి తెరలేపాడు.
2. ఈ 1691 ఎకరాల్లో ల్యాండ్ డెవలప్ మెంట్ కోసం 2018లో ఏపీ ప్రభుత్వం నుంచి CRDA మరియు అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్స్ లిమిటెడ్‌కు ఒప్పందం కుదిరింది.
3.అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్నర్స్‌లో సింగపూర్ కంపెనీలు అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్, సెమ్‌కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్లు ఉన్నాయి. ఇవి కన్సార్షియం
ఏర్పడ్డాయి. ఈ కన్సార్షియం చంద్రబాబు బినామీలతో కూడిన క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ CCMDC ని చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా చొరబడేలా చేశాడు. ( అఫీషియల్ డాక్యుమెంట్ చూడొచ్చు)
4.ఉద్దేశ పూర్వకంగా ఈ కంపెనీలకు అప్పగించడానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎంపిక చేశారు. అంటే ఒక ప్రాజెక్టు ఆలోచన వాళ్లు చేస్తారు, ఎంత ఆదాయం ఇస్తామో వాళ్లే ప్రభుత్వానికి చెప్తారు, అంతకంటే ఎక్కువ ఇస్తామని ఏదైనా ఇతర కంపెనీ ఇస్తే ఆ కంపెనీకి ఆప్రాజెక్టు ఇస్తారు, లేదా, ఆ ధర తామే ఇస్తామంటే, ప్రాజెక్టు ఆలోచన చేసిన కంపెనీకి ఇస్తారు. కాని ఇక్కడ ఆదాయం ఎంత అనే విషయాన్ని ఈ కంపెనీలు చెప్పలేదు. దీన్ని హైకోర్టుకూడా తప్పుబట్టింది. అయినా వీటికే కోర్ క్యాపిటల్ ల్యాండ్ డెవలప్ మెంట్‌ను చంద్రబాబు అప్పగిస్తారు. అమరావతిలో అవినీతికి ఈ రకంగా పునాదులు పడ్డాయి.
5.కోర్ క్యాపిటల్ లోని 1691 ఎకరాల్లో రోడ్లకోసం 371 ఎకరాలు పోనూ, మిగిలిన 1321 ఎకరాల్లో 250 ఎకరాలు సింగపూర్ కన్సార్షియంకు ఫ్రీగా ఇస్తారు. అవి ఆ కన్సార్షియం అమ్ముకోవచ్చు. ప్రభుత్వానికి ఒక్కపైసా రాదు. మిగిలిన 1070 ఎకరాలను ప్లాట్లుగా వేస్తారు.
6. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులన్నీకూడా మొత్తం ప్రభుత్వమే పెడుతుంది. దీనికోసం రూ.5,500 కోట్లు ప్రభుత్వమే పెడుతోంది. సింగపూర్ కన్సార్షియంలో చంద్రబాబు బినామీల CCDMCల వాటాగా కేవలం రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది.
7.విచిత్రంగా ఈ 1070 ఎకరాల్లో తన బినామీలు ఉన్న CCDNCతో కూడిన సింగపూర్ కంపెనీల కన్సార్షియంకు, ఉచితంగా 250 ఎకరాలు ఇస్తానని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నాడు. ఇవాళ చంద్రబాబు చెప్తున్న ధర ప్రకారం ఎకరా రూ.50 కోట్లు లెక్కవేసుకుంటే ఈ 250 ఎకరాల విలువ అక్షరాల రూ.12,500 కోట్లు. ఇది ప్రజల ఆస్తులను కొట్టేయడం కాదా?
8.ఈ అవినీతి బాగోతం ఇక్కడితో ఆగిపోలేదు. 1071 ఎకరాల అభివృద్ధికోసం రూ.18,229 కోట్లు ఖర్చుచేసినా రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్ కంపెనీలో దక్కే వాటా 42 శాతం మాత్రమే. చంద్రబాబు బినామీలతోకూడిన సింగపూర్ కన్సార్షియంకు దక్కే వాటా 58 శాతం.

9. కాని 250 ఎకరాలు ఉచితంగా ఇవ్వడం ద్వారా రూ.12,500 కోట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికోసం ప్రభుత్వం ఇచ్చే రూ.5,500 కోట్లు, CCDMC వాటా కింద ఇచ్చే రూ.221.9కోట్లు వెరసి రూ.18,221.9 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రభుత్వ సంస్థ సీఆర్డీయేకు దక్కే వాటా కేవలం 42శాతమే. ఇది స్కాం కాదా?
10.చివరకు స్టార్టప్ ఏరియా టర్నోవర్‌లో ప్రభుత్వానికి సగటున దక్కే వాటా కేవలం 8.7 శాతం దక్కనుండగా కన్సార్షియానికి 91.3 శాతం వాటా లభిస్తుంది. మరి అవినీతి కాదా?
11.వాస్తవానికి కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీలు పెట్టుబడులు పెట్టారు. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ సహకరించారు. బాబు దెబ్బకు సింగపూర్ ప్రతిష్ఠ కూడా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా?
12.ఇక ప్లాట్ల విక్రయం వ్యవహారాలు చూసేందుకు తీసుకొచ్చిన CCDMC కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు. మరి ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి పోతోంది?
13.సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ పనులను ఇచ్చారన్నది అబద్ధం. ‘సుర్బానా–జురాంగ్’కు రూ.28.96 కోట్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. దీన్ని తప్పు బడుతూ 2023లో కాగ్ నివేదిక ఇచ్చింది.
14.అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్‌కు... 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం రావడంతో తెరపడింది. కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతింటుందని సింగపూర్ సంస్థల కన్సార్షియం ఆందోళన చెందింది. దాంతో 2019 అక్టోబర్ 30న ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వాస్తవం కాదా?