‘చంద్రబాబు కొడుకు, బ్రహ్మణి భర్త తప్ప లోకేశ్‌ అర్హత ఏంటి’  | YSRCP MP Bharath Satirical Comments On Nara Lokesh | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు కొడుకు, బ్రహ్మణి భర్త తప్ప లోకేశ్‌ అర్హత ఏంటి’ 

Sep 4 2023 3:02 PM | Updated on Sep 4 2023 3:07 PM

YSRCP MP Bharath Satirical Comments On Nara Lokesh - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌పై వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ముద్దపప్పు లోకేశ్‌.. బ్రహ్మణి భర్తగా, బాలకృష్ణ అల్లుడిగా, చంద్రబాబు కొడుకుగా తప్ప తన కంటూ ఏవిధమైన ప్రత్యేక అర్హత లేని వ్యక్తి అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

కాగా, ఎంపీ భరత్‌ సోమవార​ం రాజమండ్రి నగరపాలక సంస్థ కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్‌ మాట్లాడుతూ.. ‘ట్రాక్టర్లు కొనుగోలు చేయడం వల్ల సంవత్సరానికి కోటి రూపాయలు అద్దె రూపంలో ప్రైవేటు వాహనదారులకు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. ఇదే క్రమంలో నారా లోకేశ్‌పై పొలిటికల్‌ సెటైర్లు వేశారు. ఎలాంటి అర్హతలు లేని వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడటం విడ్డూరం. 

అర్ధరాత్రి పాదయాత్ర చేసే వ్యక్తి లోకేశ్‌..
కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని నారా లోకేశ్‌.. సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారు. లోకేశ్‌.. అర్ధరాత్రి పాదయాత్ర చేసే వ్యక్తి. ప్రజల సమస్యలు తెలుసుకునే నాయకుడు పగటిపూట పాదయాత్ర చేస్తారు. లోకేశ్‌ తెల్లవారుజామున పాదయాత్ర చేయడం హాస్యాస్పదం అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఆ డబ్బంతా ఏమైందో ఆలోచించండి..
మరోవైపు.. మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో ఆంధ్ర రాష్ట్రం చదువుల్లో 15వ స్థానంలో ఉండేది. నేడు ఆంధ్ర రాష్ట్రం విద్యా వ్యవస్థలో 3వ స్థానంలోకి తీసుకొచ్చారు సీఎం జగన్. పప్పు లోకేష్ పాదయాత్రలో యువకుల్ని గొడవలు పడండి, కేసులు పెట్టించుకోండి  అంటున్నాడు. మీ పిల్లలు గొప్పగా ఉన్నత స్థితిలో ఉండాలని సీఎం జగన్ కోరుకొంటున్నారు. ముఖ్యమంత్రి పారదర్శక పాలన గురించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ తెలుసుకుని వెళ్తున్నారు. ఇన్ని పథకాల ద్వారా సీఎం జగన్‌ మీకు ఇన్ని డబ్బులు ఇస్తున్నారు కదా.. మరి గతంలో ఈ డబ్బంతా ఏమైపోయిందో ఆలోచించండి’ అని అన్నారు. 

ఇది కూడా చదవండి: ఏబీఎన్‌ రాధాకృష్ణను కమ్మేసిన చంద్ర మాయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement