‘అమరావతి నుంచి చెత్త వరకూ అంతా దోపిడీనే’ | YSRCP MLC Chandra Sekhar Reddy Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘అమరావతి నుంచి చెత్త వరకూ అంతా దోపిడీనే’

Oct 12 2026 4:29 PM | Updated on Oct 12 2026 4:39 PM

YSRCP MLC Chandra Sekhar Reddy Slams Chandrababu Govt

తాడేపల్లి: అమరావతి మొదలుకొని చెత్త వరకూ చంద్రబాబు ప్రభుత్వంలో అంతా దోపిడీనే జరుగుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. చెత్తలోనూ రూ. 1200 కోట్లకుపైగా దోపిడీకి కూటమి ప్రభుత్వం స్కెచ్‌ వేసిందని మండిపడ్డారు. చెత్తను కూడా వదలకుంటా దోచుకుంటున్న చెత్త ప్రభుత్వమని ధ్వజమెత్తారు. లెగసీ పేస్ట్‌ పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపారంటూ మండిపడ్డారు చంద్రశేఖర్‌రెడ్డి.  టన్ను చెత్త ప్రాసిసింగ్‌కు రూ. 800 చొప్పున బిల్లులు కడుతున్నారన్నారు. 

‘చెత్త పరిమాణాన్ని అమాంతం పెంచి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్లలోనే భారీ వ్యత్యాసాలు. మొదట 85 లక్షల టన్నుల చెత్త ఉందన్న ప్రభుత్వం.. ఇప్పుడు 1.62 కోట్ల టన్నులకు లెక్కలు పెంచింది. ఐదు నెలల వ్యవధిలో చెత్త పరిమాణం దాదాపు రెట్టింపు ఎలా అయింది?, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ చెప్పిన లెక్కలకే పొంతన లేదు. చీఫ్ సెక్రటరీ సంతకాలతో సమర్పించిన అఫిడవిట్లలో పరస్పర విరుద్ధమైన లెక్కలు చెబుతున్నారు. ఇప్పటికే తొలగించామని చెప్పిన చెత్తను మళ్లీ లెక్కల్లో చూపించి బిల్లులు పెడుతున్నారు. కడపలో 1.08 లక్షల టన్నుల చెత్తను 8.41 లక్షల టన్నులకు పెంచినట్లు ఆరోపణలున్నాయి. అనంతపురంలో పూర్తిగా తొలగించామన్న 3.32 లక్షల టన్నుల చెత్త.. మళ్లీ 7.10 లక్షల టన్నులుగా ఎలా మారింది?

తిరుపతిలో 2.04 లక్షల టన్నుల చెత్తను తొలగించామని చెప్పి.. మళ్లీ 7.42 లక్షల టన్నులకు లెక్కలు పెంచారు, ప్రొద్దుటూరులో 57 వేల టన్నుల నుంచి 4.04 లక్షల టన్నులకు చెత్త లెక్కలు పెంచారు. కుప్పంలో 2,555 టన్నుల చెత్తను తొలగించామని చెప్పి.. మళ్లీ 35 వేల టన్నులుగా చూపించారు. చెత్త లెక్కల్లో భారీ తేడాలపై చంద్రబాబు, నారాయణ సమాధానం చెప్పాలి. చెత్త తొలగించకుండానే తొలగించినట్లు తప్పుడు బిల్లులు సృష్టిస్తున్నారు. పరిపాలనా అనుమతులు లేకుండానే చెత్త టెండర్లు ఎలా అప్పగించారు?, జైపూర్‌లో ప్రైవేట్ భవనంలో రహస్య సమావేశాలు నిర్వహించి చెత్త కాంట్రాక్టులు ఖరారు చేశారు. ఇతర కాంట్రాక్టర్లను విజిలెన్స్ విచారణల పేరుతో బెదిరించి టెండర్లకు దూరం చేశారు. అక్టోబర్ 2, 2025 నాటికి చెత్త తొలగిస్తామని చెప్పిన హామీ ఏమైంది?, చెత్తను ప్రాసెస్ చేయకుండా డంపింగ్ యార్డుల్లో తగలబెడుతున్నారు.

వందకు పైగా పట్టణ స్థానిక సంస్థల పరిధిలో చెత్తను తగలబెడుతున్నట్లు ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. చెత్తను తగలబెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది కూటమి ప్రభుత్వం. చెత్త కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను ఎన్జీటీకి సమర్పిస్తాం. లెగసీ వేస్ట్ తొలగింపు ప్రక్రియను 2021లోనే ప్రారంభించిన ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానిది. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన క్లాప్‌(CLAP) కార్యక్రమంతోనే పారిశుద్ధ్య రంగంలో సంస్కరణలు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే 41 లక్షల టన్నులకు పైగా లెగసీ వేస్ట్ తొలగించినట్లు కూటమి ప్రభుత్వ తొలి అఫిడవిట్‌లోనే వెల్లడించింది. వైఎస్ జగన్ చేసిన పనులను తమ ఖాతాలో వేసుకుని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ చేసిన పారిశుద్ధ్య సంస్కరణలను కప్పిపుచ్చి చెత్త పేరుతో చంద్రబాబు రాజకీయాలు. రూ.600 కోట్లతో 107 చెత్త ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటులోనూ కమీషన్ల దందా జరుగుతోంది. చెత్త పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చెత్త కుంభకోణంపై స్వతంత్ర విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలి’ అని డిమాండ్‌ చేశారు. 

ఇదీ చదవండి: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో మేయర్‌ రిజర్వేషన్లు ఖరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement