‘ఎమ్మెల్యే వీడినా నష్టం లేదు.. ఉదయగిరిలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది’ | Ysrcp Leaders Fires Udayagiri Mla Mekapati Chandrasekhar Reddy Nellore | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యే వీడినా నష్టం లేదు.. ఉదయగిరిలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది’

Apr 10 2023 3:16 PM | Updated on Apr 10 2023 4:12 PM

Ysrcp Leaders Fires Udayagiri Mla Mekapati Chandrasekhar Reddy Nellore - Sakshi

సాక్షి,నెల్లూరు: ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పార్టీలోని ముఖ్యనేతలు ఏకమౌతున్నారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని మండలాల నేతలు భారీగా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఉదయగిరి నియోజకవర్గ మాజీ పరిశీలకులు కొడవలూరు ధనుంజయ రెడ్డి దీనిపై మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలంగానే ఉంది.. ఎమ్మెల్యే పార్టీ వీడినా ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు.  ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వైఖరి వల్ల నేతలు పార్టీకి దూరమయ్యారని ధ్వజమెత్తారు.

 ఎమ్మెల్యే ప్రోద్బలంతో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయని.. మండల కన్వీనర్ పదవులను చంద్రశేఖర్ రెడ్డి డబ్బులకు అమ్ముకున్నారని మండిపడ్డారు. పార్టీ పదవులను ఎమ్మెల్యే అమ్ముకుని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని.. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. తన పై చంద్రశేఖర్‌ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శల మీద న్యాయ పోరాటం చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement