
అన్నమయ్య జిల్లా: కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి రమేష్‌రెడ్డి హెచ్చరించారు. బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంలో చంద్రబాబుని, రాంప్రసాద్‌రెడ్డిని విమర్శించానని తనను తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తారా? అని నిలదీశారు.
‘మీరు ఏదన్నా చేస్తే బయపడి పారిపోయే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరు. నీ తాటాకు చప్పుళ్లకు, ఉడుత ఊపులకు భయపడి వాడు ఇక్కడ ఎవరూ లేరు. నా లైఫ్‌లో మీలాంటి వాళ్లను వందమందిని చూశా. నోటికొచ్చినట్లు తల్లిదండ్రులను కూడా తిడుతున్నారు..మీరు వాడే పదాలు నాకూ వచ్చు. మా తండ్రి గురించి విమర్శలు చేశారు..నాకు సంస్కారం ఉంది కాబట్టి వాళ్ల తండ్రి గురించి నేను మాట్లాడను.
చంద్రబాబూ...ఇలాంటి సంస్కారం మీరే నేర్పించారా..?, చంద్రబాబు ఇవ్వలేదు కాబట్టే సూపర్ సిక్స్ గురించి మాట్లాడాం.. ప్రతిపక్షం విమర్శలు చేస్తే మీకేమి ఇబ్బంది..?, మీ పదవులు, అధికారాలు ఎక్కువ రోజులు ఉండవు. వచ్చేసారి మేము అధికారంలోకి వస్తాం... అప్పుడు వడ్డీతో సహా లెక్క కట్టి ఇస్తాం’ అని రమేష్‌రెడ్డి హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో కూటమికి డిపాజిట్లు కూడా రావని, వైఎస్సార్సీపీ నూటికి నూరు శాతం గెలవడం ఖాయమని రమేష్‌రెడ్డి పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిని ఫోన్‌లో పరామర్శించిన వైఎస్ జగన్