‘విదేశీ నిపుణుల కమిటీని సీరియస్‌గా తీసుకోండి’ | YSRCP Leader Kurasala Kannababu Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘విదేశీ నిపుణుల కమిటీని సీరియస్‌గా తీసుకోండి’

Oct 8 2026 7:01 PM | Updated on Oct 8 2026 7:38 PM

YSRCP Leader Kurasala Kannababu Slams Chandrababu Govt

కాకినాడ:  పోలవరం ప్రాజెక్టు అనేది రాష్ట్రానికి జీవనాడి అని, అలాంటి పోలవరానికి కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో నాణ్యత లోపించిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెబుతోందని, ఇప్పటికి ఏడుసార్లు వచ్చిన అంతర్జాతీయ కమిటీ లేవనెత్తిన అంశాలకు కూటమి ప్రభుత్వం సమాదానాలు చెప్పడం లేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీడబ్యూసీకీ, పోలవరం అధారిటీకీ పోలవరం నాణ్యత లోపాలపై కమిటీ నివేదిక ఇచ్చిన విషయాన్ని కురుసాల గుర్తు చేశారు. దీనిపై ఒక్క సమీక్ష కూడా ప్రభుత్వం చేపట్ట లేదన్నారు. 

‘ఒకపక్క ప్రాజెక్టు ను ఎత్తును తగ్గించి.. మరోవైపు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. అభ్యంతరాలను కమీటీ లేవనెత్తితే ప్రభుత్వం నుండి స్పందన లేదు.   చేసేవన్ని వెన్నుపోటు పనులు.. ఎదుట వారి పై బురద చల్లడమే కూటమి పరిపాటిగా పెట్టుకుంది. కమిటీ నివేదికను ప్రభుత్వం ఎంతో సీరియస్‌గా తీసుకోవాలి. జాతీయ స్థాయి ప్రాజెక్టుకు క్వాలిటీ సర్టిఫికేట్‌ కాంట్రాక్టర్‌ ఇస్తారా?, ఏ కాంట్రాక్టర్ కోసం పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు. 

కేంద్ర కట్టాల్సిన జాతీయ స్ధాయి ప్రాజెక్టు ను మేమే కడతామని చంద్రబాబు తీసుకున్నారు. రాజమండ్రి సభలో ప్రధాని మోది... చంద్రబాబుకు పోలవరం అంటే ఏటీఎం అని సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ తీసుకుని ఇవాళ్టీకీ కూడా పోలవరంను ఏటీఎంగా చంద్రబాబు వాడుకుంటున్నారు. డయాఫ్రం వాల్‌ను తాపత్రయ పడి చంద్రబాబు ఎందుకు ముందు కట్టారు?

దాని వల్లే పోలవరం నిర్మాణానికి అనేక సమస్యలు వస్తున్నాయి‌. ఇప్పటికీ ఏడు సార్లు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు రిబ్బన్ కట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం కుదించేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల రాష్ట్రానికి ఊహకి అందనంత  శాశ్వతమైన నష్టం కలగబోతుంది. 75 టిఎంసిల నిల సామర్థ్యం తగ్గిపోయింది. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల గ్రావెటీ వల్ల కాలువల్లో నీరు పారదు. ఉత్తరాంధ్ర సుజల సృవంతి కలగా మిగిలిపోనుంది. గ్రేడింగ్ చేయని రాళ్ళతో నిర్మాణం చేస్తున్నారు అని కమిటీ గుర్తించింది. నాణ్యతే లేదని కమీటీ చెబుతుంటే‌...మీరేమో డయాఫ్రమ్ వాల్ ఇన్ని రోజుల్లో పూర్తి చేశామని సినిమా మాదిరిగా రికార్డులు చెబుతున్నారు. పోలవరంతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉంది. 

పోలవరం అంటే గుర్తుకు వచ్చేది దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్సార్‌. ఎవరో చేసిన పనికి రిబ్బన్ కట్‌ చేసి నేనే చేశానని చంద్రబాబుకు  చెప్పుకోవడం అలవాటు. మీ డిజైన్ల లోపం వల్లే ఆనాడు పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకు పోయింది. విదేశీ నిపుణుల కమిటీని సీరియస్‌గా తీసుకోకపోతే పోలవరం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. నియోజకవర్గాల‌ పునర్విభజన అయ్యే అవకాశం కేంద్రంలో కనిపిస్తొందా?, కొంతమందిని ఆకర్షించడానికి చంద్రబాబు పునర్విభజన పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారు’ అని మండిపడ్డారు.

ఇదీ చదవండి: సునీత దంపతులు చంద్రబాబును కలవడానికి కారణం ఏంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement