కష్టమొచ్చినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Great Words In Ysrcp Leaders Meeting | Sakshi
Sakshi News home page

కష్టమొచ్చినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి: వైఎస్‌ జగన్‌

Published Fri, Nov 29 2024 7:32 PM | Last Updated on Fri, Nov 29 2024 7:51 PM

Ys Jagan Great Words In Ysrcp Leaders Meeting

సాక్షి, గుంటూరు: తాను మీ అందరినీ కోరేది ఒక్కటే.. మన పోరాట పటిమ సన్నగిల్లకూడదంటూ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్ట,నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకోండి’’  అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

‘‘16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్‌ కూడా ఇవ్వలేదు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను. ఈ సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటా. రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతా.. ‘కార్యకర్తలతో జగనన్న, పార్టీ  బలోపేతానికి దిశానిర్దేశం’ అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ వెల్లడించారు.

‘‘ప్రతిపక్షంలో ఉంటూ రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్‌తో యుద్ధం చేశాను. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ ఇద్దరూ నా మీద పిటిషన్లు వేశారు. ఇంత మందితో యుద్ధం చేస్తున్నా... నేను బెయిల్‌ పిటిషన్‌ వేసినప్పుడల్లా అన్న మాటేమిటంటే.. నేను బయటకు వస్తే ఇన్‌ప్లూయన్స్‌ చేస్తానని చెప్పేవారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మీ ప్రభుత్వాలే అయినా నేను ప్రభావితం చేస్తానని బెయిల్‌ తిరస్కరించారు.  ఇలా 16 నెలలు చేసారు. కానీ ఏమైంది.. ఆ తర్వాత బయటకు వచ్చి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పరిపాలన చేశాం.

ఇదీ చదవండి: ఈ దెబ్బకు చంద్రబాబు సింగిల్‌ డిజిట్‌కు వెళ్లాల్సిందే: వైఎస్‌ జగన్‌

..అలానే కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత పగలు రాక తప్పదు. ఇది సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకొండి. కష్టాల్లో ఉన్నప్పుడు పోరాటం చేయగలిగితే మనం తిరిగి నిలబడగలుగుతాం. కాలం గడిచే కొద్దీ ఈ భయాలు పోతాయి. మరో రెండు మూడు నెలల్లో అందరూ దైర్యంగా రోడ్డు మీదకు వస్తారు. అందరిలో ఈ ధైర్యం రావాలి. ఎందుకంటే ప్రజల తరపున, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజా వ్యతిరేక పెరుగుతోంది. ప్రజల తరపున వారికి అండగా నిలవగలిగితే... ప్రజలు మనతో పాటు నడుస్తారు. మీరందరూ ఎంపీపీ, జడ్పీటీసీ వంటి మండలస్ధాయి నాయకులు.. మీరు ఇంకా ఎదగాలంటే.. ప్రతిపక్షంలో మీరు ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నదే నిర్ణయిస్తుంది.’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement