వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌: బీజేపీ ట్వీట్‌కు కాంగ్రెస్ రీట్వీట్..!

We Believe In You Team India Says BJP Congress Quips True That - Sakshi

అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్‌లో జరుగుతోంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా-భారత్ నేడు తలపడుతున్నాయి. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అటు.. టీమిండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ టీమిండియాకు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు కాంగ్రెస్ పార్టీ చమత్కారంగా రీట్వీట్ చేసింది.

'కమాన్ టీమిండియా.. మీపై నమ్మకం ఉంది' అని పేర్కొంటూ బీజేపీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. 'నిజమే.. జితేగా ఇండియా' అంటూ ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ రీట్వీట్ చేసింది. అయితే.. ఇండియా అనే అనే పదంపై ఇటీవల పెద్ద వివాదం నడిచిన విషయం తెలిసిందే.

బీజేపీని ఓడించే లక్ష‍్యంతో దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడంపై రాజకీయంగా పెద్ద వివాదం నడిచింది. ప్రతిపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయ పార్టీలు పేర్లు పెట్టుకోవడంలో నిబంధనలు విధించలేమని ఎలక్షన్ కమిషన్‌ కూడా తెలిపింది. 

ప్రతిపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టిన తర్వాత జరిగిన జీ-20 సమావేశంలో దేశం పేరును కేంద్రం భారత్‌గా పేర్కొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వాన పత్రంలోనూ భారత్ ప్రెసిడెంట్‌ అని సంబోధించింది. దీనిపై కేంద్రంలోని బీజేపీని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.  

ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం.. ఫ్రీ-పాలస్తీనా టీషర్ట్‌తో మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top