Warangal: Congress Workers Brawl At Errabelli Swarna Meet - Sakshi
Sakshi News home page

వీడియో: కొండా వర్సెస్‌ ఎర్రబెల్లి!.. చొక్కాలు చించుకుని చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

May 31 2023 2:07 PM | Updated on May 31 2023 2:57 PM

Warangal Congress Workers Brawl AT Errabelli Swarna Meet - Sakshi

చెప్పులతో కొట్టుకుంటూ చొక్కాలు చించుకున్నారు కాంగ్రెస్‌ కార్యకర్తలు.. 

సాక్షి, వరంగల్:  వరంగల్‌ కాంగ్రెస్‌లో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. కొండా దంపతుల అనుచరులు, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు బుధవారం కెమెరాల సాక్షిగా బాహాబాహీకి దిగారు. డీసీసీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణం స్వీకార కార్యక్రమంలోనే ఈ రసాభాసా జరగడం గమనార్హం. 

డీసీపీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వంలో తొలిసారి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కొండా దంపతులు హాజరు కాలేదు. అయితే.. ఒకవైపు కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే  అక్కడ గందరగోళం నెలకొంది. రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు తన్నులాటకు దిగారు కార్యకర్తలు. కొండా వర్గానికి చెందిన జిల్లా ఎస్సీ సెల్ నాయకులు సంతోష్ పై దాడి చేసిన ఎర్రబెల్లి వర్గం. ఎర్రబెల్లి వర్గానికి కట్ట స్వామి  నేతృత్వంలో ఈ దాడి జరిగినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఒకానొక టైంకి చొక్కాలు చించుకుని.. చెప్పులతో కొట్టుకునే దాకా వెళ్లింది పరిస్థితి.  దీంతో రసాభాసా నెలకొంది. గొడవకు దిగిన కార్యకర్తల అంతుచూస్తానంటూ ఎర్రబెల్లి స్వర్ణ భర్త వార్నింగ్‌ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే కాసేపటికి పరిస్థితి సర్దుమణిగింది. ఇది గ్రూప్‌ వార్‌ కాదని, కులం పేరుతో ఓ వ్యక్తి దూషించినందుకు నెలకొన్న వివాదం మాత్రమేనని కాంగ్రెస్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎర్రబెల్లి స్వర్ణకు డీసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడంపై కొండా వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement