కోవిడ్ ప్యానెల్ నుంచి తప్పుకున్న టాప్ వైరాలజిస్ట్

Virologist Shahid Jameel Quits Covid Panel After Airing Differences - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు చెందిన వివిధ వేరియంట్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రీయ సలహా బృందం నుంచి సీనియర్ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్‌ తప్పుకున్నారు. కోవిడ్ రెండో దశను అరికట్టే విషయంలో కేంద్రం తీసుకొన్న నిర్ణయాలను ప్రశ్నించిన కొద్ది రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జమీల్‌ ఇండియన్ సార్స్-కోవ్-2 జినోమిక్ సీక్వెన్సింగ్‌ కన్సార్టియం (ఐఎన్ఎస్ఏసీఓజీ) లో సభ్యుడిగా ఉన్నారు. రాజీనామా అనంతరం ‘నేను సరైన నిర్ణయమే తీసుకున్నా.. కానీ దీనిపై మాట్లాడటానికి ఇంకేం లేదు. రాజీనామాపై ఎటువంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు.’ అని రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.

కాగా ఈ అంశంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెక్రెటరీ రేణూ స్వరూప్ స్పందించడానికి విముఖత చూపారు. ఇక ఇటీవల ‘భారత్‌లోని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారిత విధాన రూపకల్పనకు మొండి వైఖరితో కూడిన ప్రతిస్పందనను ఎదుర్కొంటున్నారని డాక్టర్ జమీల్ న్యూయార్క్ టైమ్స్‌కు రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. దేశంలో కోవిడ్ నిర్వహణ ముఖ్యంగా తక్కువ సంఖ్యలో టెస్టింగ్, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ కొరత, హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ అతి తక్కువ స్థాయిలో ఉండడం వంటి కారణాలే భారత్‌లో కోవిడ్‌ వ్యాప్తికి దోహదపడుతున్నాయని విమర్శించారు. 

ఈ చర్యలన్నింటికీ భారతదేశంలోని తన తోటి శాస్త్రవేత్తలలో విస్తృత మద్దతు ఉంది. కానీ వారు సాక్ష్యాధారిత విధాన రూపకల్పనకు మొండి పట్టుదలను ఎదుర్కొంటున్నారుని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ప్రధాన మంత్రికి ఏప్రిల్ 30న 800 మంది భారతీయ శాస్త్రవేత్తలు విజ్ఙప్తి చేసినట్లు తెలిపారు. భారత్‌లో మహమ్మారి నియంత్రణలో లేనందున డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మరో ప్రమాదమేనని, మహమ్మారిని అదుపు చేయలేకపోతే శాశ్వత మచ్చగా మిగిలిపోతుందన్నారు. తమ పరిశోధనల ఫలితాలపై ప్రభుత్వం పెద్దగా దృష్టిపెట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

చదవండి: కరోనా వచ్చి పోయినా జలుబు తగ్గట్లేదు.. బ్లాక్‌ ఫంగసా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-05-2021
May 17, 2021, 12:26 IST
కోవిడ్‌ ఎంతోమంది ప్రజల ప్రాణాలను హరిస్తోంది. సినీ రంగానికి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు దీని బారిన పడి కన్నుమూశారు. మరికొందరు...
17-05-2021
May 17, 2021, 11:04 IST
సాక్షి, హైదరాబాద్‌: అసలే ఎండాకాలం.. పైగా అది అడవి.. దాహార్తి తీర్చుకోవడమే గగనం.. మరోవైపు బీపీ, షుగర్, ఆస్తమా.. వీటికితోడు...
17-05-2021
May 17, 2021, 10:38 IST
సాక్షి, ఖమ్మం: కరోనా సోకిన వారు అనవసర ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండి.. వైద్యులు సూచించిన మందులు వాడడం ద్వారా...
17-05-2021
May 17, 2021, 09:27 IST
హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతోంది. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. చాలా...
17-05-2021
May 17, 2021, 09:13 IST
నల్లగొండటౌన్‌ : కరోనా వైరస్‌ మరింత శక్తివంతంగా మారుతోంది. మొదటి దశలో కంటే రెండో దశలో కేసులతో పాటు మరణాల...
17-05-2021
May 17, 2021, 08:43 IST
గీసుకొండ : గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ ధర్మారానికి చెందిన హమాలీ కార్మికుడు దొండ అనిల్‌యాదవ్‌కు వారం రోజుల క్రితం...
17-05-2021
May 17, 2021, 08:00 IST
ఆ సంఖ్య మారలేదు. అలాగే ఉంది. దాంట్లో ఎలాంటి మార్పుచేర్పుల్లేవు. ఏదో ఒక్కరోజు మాత్రమే  తెలపాలనుకున్నప్పుడు  వెబ్‌సైట్‌లో ఎందుకు ..?...
17-05-2021
May 17, 2021, 06:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా గణాంకాలు ఊరటనిస్తున్నాయి. ఇంకా రోజుకు మూడు లక్షలకు పైనే కేసులు వస్తున్నప్పటికీ... మొత్తం మీద చూస్తే...
17-05-2021
May 17, 2021, 06:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగరాలు, పెద్ద పట్టణాలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను, గిరిజన తండాలను సైతం...
17-05-2021
May 17, 2021, 05:37 IST
అమలాపురం టౌన్‌: వారిద్దరూ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కుర్రాళ్లు. కష్టపడి ఉన్నత శిఖరాలను ఆధిరోహించిన యువ కిశోరాలు. ఒకరు...
17-05-2021
May 17, 2021, 04:40 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ మరణాలను ప్రపంచ దేశాలు తక్కువగా చూపిస్తున్నాయంటోంది యూనివర్సిటీ ఆఫ్‌ అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌...
17-05-2021
May 17, 2021, 04:34 IST
లక్ష్మీపురం(గుంటూరు): గుజరాత్‌ జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ ప్లాంట్‌ నుంచి ఆక్సిజన్‌ కంటైనర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌ ఆవరణలోని కాంకర్‌...
17-05-2021
May 17, 2021, 04:29 IST
మచిలీపట్నం:  కోవిడ్‌ మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మొబైల్‌ ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా,...
17-05-2021
May 17, 2021, 04:25 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2020 మార్చి నుంచి ఇప్పటి వరకూ కరోనా నియంత్రణ కోసం 2,229 కోట్ల పైచిలుకు వ్యయమైంది....
17-05-2021
May 17, 2021, 04:12 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులకు కాంగ్రెస్‌ అభయ‘హస్తం’అందించనుంది. అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోగులకు అండగా ఉండాలని...
17-05-2021
May 17, 2021, 04:01 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరికలకు నిర్వహించాల్సిన  ప్రవేశ పరీక్షలు నిర్ణీత తేదీల్లో జరుగుతాయా? లేదా?...
17-05-2021
May 17, 2021, 03:29 IST
సాక్షి, హైదరాబాద్‌: అక్కడ మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే. కరోనా రోగి కదా అన్న కరుణాలేదు.. చేసిందే చికిత్స.....
17-05-2021
May 17, 2021, 03:13 IST
సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు మీదికి బైక్‌పై వచ్చిన ఓ యువకుడిని పోలీసులు ఆపగా ‘మా పక్క వీధిలో అంకుల్‌కు కరోనా...
17-05-2021
May 17, 2021, 02:34 IST
న్యూఢిల్లీ: డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 ఔషధం ‘2– డీజీ’ తొలిబ్యాచ్‌ సోమవారం విడుదల కానుంది. నోటి ద్వారా తీసుకునే...
17-05-2021
May 17, 2021, 02:34 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలను పంపిణీ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top