అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి  | Vijayasai Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి 

Sep 12 2020 5:05 AM | Updated on Sep 12 2020 5:05 AM

Vijayasai Reddy Fires On Chandrababu - Sakshi

‘మన చేతుల్లో మన ఆరోగ్యం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు

సాక్షి, విశాఖపట్నం: అంతర్వేది ఘటన వెనుక ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన అనుచరుల కుట్ర ఉందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. అందుకే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరామని చెప్పారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే..

► ఘటనలో పెదబాబు, చినబాబు హస్తం ఉందన్న విషయం విచారణలో బయటపడుతుంది.  హైదరాబాద్, గుంటూరు వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు.  
► చంద్రబాబు ప్రవాసాంధ్రుడిలా హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి బీజేపీ, జనసేన మత రాజకీయాలు చేస్తున్నాయి.  
► గత సార్వత్రిక ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమైన టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేసే సమయం ఆసన్నమైంది.  
► కాగా, కరోనా నుంచి కోలుకున్న అనుభవాలతో విజయసాయిరెడ్డి రాసిన ‘మన ఆరోగ్యం మన చేతుల్లో’ పుస్తకాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అదీప్‌రాజ్, గొల్ల బాబూరావు, చెట్టి పాల్గుణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement