
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో సోమవారం ఆయన ‘ప్రచారం మీద బతికే అసమర్థుడికి ఎల్లో మీడియా పాలనాదక్షుడు అనే ఎలివేషన్ ఇచ్చింది. దిగిపోయే ముందు ఆఖరి సంత్సరంలో 250 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లి వడ్డీ కింద 108 కోట్ల ప్రజా ధనాన్ని చెల్లించాడు. అడ్మినిస్ట్రేటర్ అయితే ఇలా చేస్తాడా.. కాగ్ నివేదికపై మాట్లాడే ధైర్యముందా బాబ’ ట్విట్టర్ వేదికగా విజయ్ సాయి రెడ్డి సవాలు చేశారు. (చదవండి: ‘బాబులో వణుకు మొదలైంది’)