
సాక్షి, అమరావతి: క్రైం రికార్డు బ్యూరో తాజాగా వెల్లడించిన రిపోర్టులో టీడీపీ హయాంలో కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 18శాతం నేరాలు తగ్గిన విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'వైఎస్సార్ కాంగ్రెస్ గెలిస్తే అరాచకమే అంటూ శోకాలు పెట్టిన వారంతా ఏమయ్యారో? బాబు హయాంలో కంటే 18% నేరాలు తగ్గినట్టు క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. కుల, మత ఘర్షణలు, రెచ్చగొట్టే కుట్రలు జరిగినా ప్రజలు పట్టించుకోలేదు. యువ సీఎం పాలనకు ఇంతకంటే ప్రశంసలు ఏం కావాలి' అని విజయసాయి రెడ్డి ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. ('చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలు పెట్టాడు')