దొంగ దీక్షలకు 300 కోట్లు ఊదేశాడు | Vijaya Sai Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తేడా తెలుస్తోందా..?

Oct 10 2020 8:47 AM | Updated on Oct 10 2020 10:11 AM

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'పోలవరం యాత్రలకు చంద్రబాబు  చేసిన ఖర్చు 400 కోట్లు, దొంగ  దీక్షలకు  మరో 300 కోట్లు ఊదేశాడు. జగన్ గారు 43 లక్షల మంది విద్యార్థులకు బ్యాగు, నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బూట్లు, సాక్స్, బెల్ట్ తో కూడిన కిట్ ఇవ్వడానికి చేసిన ఖర్చు 650 కోట్లు. ఏది విజన్ ? ఏది దుబారా ?' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. 

కాగా మరో ట్వీట్‌లో.. 'రాజధాని ఇటుకల కోసం స్కూలు పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ? రియల్ ఎస్టేట్ భూముల విలువ పెంచుకునేందుకు పసివాళ్లని కూడా వదల్లేదు కదా. మీరు వాళ్ల జేబులు ఖాళీ చేస్తే, ఇప్పుడా విద్యార్థుల భవిష్యత్తుకు  జగన్ గారు బంగారు బాటలు వేస్తున్నారు. తేడా తెలుస్తోందా?' అంటూ ట్వీట్‌ చేశారు. 

(చంద్రబాబు కడుపుమంటపై తమిళ పత్రిక కథనం)

(రోజువారీ విచారణకు బాబు అక్రమాస్తుల కేసు) 

Advertisement
 
Advertisement
Advertisement