పాదయాత్రకు టీడీపీ జనసమీకరణ 

Vijaya Sai Reddy Comments On TDP Padayatra - Sakshi

వైఎస్సార్‌పీపీ నేత విజయసాయిరెడ్డి 

సాక్షి, అమరావతి: అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అరసవల్లికి బయల్దేరిన పాదయాత్ర.. పూర్వపు టీడీపీ సర్కారుకు భూములిచ్చిన రైతులకు సంబంధించిన వ్యవహారంగానే ప్రజలకు అర్థమవుతోందని వైఎస్సార్‌పీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు.

అమరావతి అధికార హోదా మారితే తాము నష్టపోతామని అనుమానిస్తున్న రైతులు ఉత్తరాంధ్రకు ఊరేగింపుగా వెళ్తుండగా టీడీపీ నేతలు వారికి జనసమీకరణ చేస్తున్నారని సోమవారం ఆయనొక ప్రకటనలో తెలిపారు.

పాదయాత్రను చూసేందుకు గుమిగూడిన జనమంతా అమరావతికి మద్దతుదారులనే రీతిలో చంద్రబాబు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మహా పాదయాత్ర లక్ష్యం కేవలం స్థానిక రైతుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణేనని, ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసునని ఆయన వివరించారు.

అమరావతి పరిధిలోని 25–30 గ్రామాలకు చెందిన రైతుల ఆందోళనను ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా చిత్రించి రాజకీయ లబ్ధిపొందడానికి చంద్రబాబు బృందం చేసే కుట్రలు ఫలించవన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top