హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని చేస్తోందా? అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీజేపీ ఆఫీస్‌పై దాడి చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందని నిలదీశారు. ఇంత జరుగుతుంటే పోలీసులు తమాషా చూస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ అరాచకం చేస్తుంటే పోలీసులు పట్టించుకోరా అంటూ ధ్వజమెత్తారు. పోలీసుల వైఫల్యానికి మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు బండి సంజయ్.
‘బీజేపీ ఆఫీస్ వద్ద ప్రధాని దిష్టిబొమ్మ దగ్దం చేసి, కార్యాలయ గేటుకు నల్ల రంగు పూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?, రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తోందా?పట్టపగలు బీజేపీ ఆఫీస్‌పై దాడి చేస్తుంటే పోలీసులు తమాషా చూస్తున్నారా?, కాంగ్రెస్‌కు తొత్తులుగా పనిచేస్తున్నారా?, నగరం నడిబొడ్డునున్న జాతీయ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని రక్షణ కల్పించే బాధ్యత మీకు లేదా?, యూత్ కాంగ్రెస్ నేతలు అరాచకం చేస్తుంటే అక్కడ పోలీసులెందుకు లేరు?, పోలీసుల వైఫల్యానికి మూల్యం చెల్లించక తప్పదు. మా సహనాన్ని చేతగానితనంగా భావిస్తే తీవ్ర పరిణామాలుంటాయ్. ఖబడ్దార్ కాంగ్రెస్ నేతలారా.... మేం తలుచుకుంటే బయట తిరగలేరు.
సాయంత్రంలోపు బాధ్యులను అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలి. లేనిపక్షంలో యూత్ కాంగ్రెస్ నేతల చర్యకు మించి ప్రతి చర్యలుంటాయ్. బీజేవైఎం కార్యకర్తలు తలుచుకుంటే యూత్ కాంగ్రెస్ నేతలు బయట తిరగలేరు. కాంగ్రెస్ నాయకత్వం తక్షణం స్పందించాలి. లేకపోతే కాంగ్రెస్ కార్యాలయాలను బీజేపీ శ్రేణులు దిగ్బంధిస్తాం. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
HYD: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. గాంధీభవన్ వద్ద హైటెన్షన్


