బీఆర్‌ఎస్‌లోకి కాసాని.. ముహూర్తం ఫిక్స్‌  | TTDP EX Chief Kasani Gnaneshwar Will Join In BRS Party | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లోకి కాసాని.. ముహూర్తం ఫిక్స్‌ 

Nov 2 2023 7:10 PM | Updated on Nov 2 2023 7:48 PM

TTDP EX Chief Kasani Gnaneshwar Will Join In BRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టీడీపీ మాజీ చీఫ్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ శుక్రవారం ఉదయం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. ఉదయం 11.30 గంటలకు గజ్వేల్‌ నియోజకవర్గం ఎర్రవల్లోని సీఎం ఫాంహౌజ్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో కాసాని  గులాబీ కండువా కప్పుకోనున్నారు.సీఎం ఫాంహౌజ్‌ కావడంతో భద్రతా పరమైన కారణాల దృష్ట్యా దృష్ట్యా పరిమిత సంఖ్యలో తన అనుచర నాయకులతో కలిసి కాసాని కారు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయదని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించడంతో నొచ్చుకున్న కాసాని పార్టీకి రిజైన్‌ చేసిన విషయం తెలిసిందే. తాను టీటీడీపీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, అంతా వృథా అయిందని మీడియా సమావేశంలో కాసాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముదిరాజులకు ప్రాధాన్యతనిస్తున్న బీఆర్‌ఎస్‌లోకి వెళ్తేనే బాగుంటుందన్న క్యాడర్‌ సలహా మేరకు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని కాసాని నిర్ణయించినట్లు సమాచారం. 

అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్లు ఇప్పటికే ప్రకటించినందున కాసానికి భవిష్యత్‌లో ఎమ్మెల్సీ లేదా ఇతర పదవి ఇచ్చి న్యాయం చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. కాసాని కూడా గతంలోలాగే ఎమ్మెల్సీ సీటే ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: మోదీకి ప్రైవేటైజేషన్‌ పిచ్చి పట్టుకుంది: కేసీఆర్‌ మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement