తెలంగాణ ఎన్నికల బరిలో బర్రెలక్క.. నామినేషన్‌ దాఖలు

TS Elections 2023: Barelakka Fame Sirisha Filed Nomination - Sakshi

నాగర్‌కర్నూల్‌: రెండేళ్ల కిందట సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయిన బర్రెలక్క గుర్తుందా?. డిగ్రీ చదివి తాను బర్రెలు కాసుకుంటున్నానని వీడియో ద్వారా తెగ వైరల్‌ అయ్యిందామె. ఆ వీడియోలోని బర్రెలక్క అలియాస్ శిరీష మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. 

‘‘హాయ్ ఫ్రెండ్స్.. నేను మీ బర్రెలక్కను డిగ్రీ చేసాను.  ఫ్రెండ్స్ ఉద్యోగ నోటిఫికేషన్ లేక మా అమ్మను అడగి బర్రెలు కొన్నాను ఫ్రెండ్స్. ఎన్ని డిగ్రీలు చేసిన సర్టిఫికేట్లు వస్తున్నాయి తప్ప ఉద్యోగాలు వస్తలేవు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో ఒకప్పుడు ఊపు ఊపిన వీడియో అది. ఆమె ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని శిరీష​ నిర్ణయించుకుంది. ఈ మేరకు కొల్లాపూర్(నాగర్‌ కర్నూల్‌) నియోజకవర్గం నుంచి నామినేషన్‌ వేసింది కూడా.  నిరుద్యోగుల తరపున పోరాడటం కోసమే తాను పోటీ చేస్తున్నానని ఈ సందర్భంగా శిరీష ప్రకటించుకుంది. ప్రజలకు ఇవ్వడానికి తన దగ్గర డబ్బు లేదని ప్రచారం చేయడానికి అంత సమయం లేదని అందరిని కలవకపోవచ్చు అందుకే ఈ వీడియో ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో వదిలింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top