మమతా బెనర్జీకి మరో బిగ్‌ షాక్‌ | Trinamool Rebel MPs give supports to NDA | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీకి మరో బిగ్‌ షాక్‌

Jun 8 2026 5:12 PM | Updated on Jun 8 2026 6:43 PM

Trinamool Rebel MPs give supports to NDA

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని 20 మంది టీఎంసీ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు 20 మంది టీఎంసీ ఎంపీలు లేఖ రాయనున్నారు. కకోలీ ఘోష్‌ను తమ నాయకురాలిగా టీఎంసీ రెబల్‌ ఎంపీలు ఎన్నుకున్నారు. రెబల్‌ ఎంపీలు అందరూ సీఎం సువేందు అధికారి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిశారు. 

మమతా బెనర్జీ ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న వేళే ఆమెకు తమ పార్టీ నుంచి ఇబ్బందులు మరింత పెరగడం గమనార్హం. విప్ పదవి నుంచి తొలగించిన తర్వాత పార్టీపై అసంతృప్తిగా ఉన్న కాకోలి ఘోష్ దస్తిదార్ మాట్లాడుతూ.. ప్రజల తీర్పు ప్రకారం తమ “భవిష్యత్‌ రాజకీయ దిశ ఎన్‌డీఏతో అనుసంధానమై ఉండాలి” అని నమ్ముతున్నామని చెప్పారు.

తనతో పాటు దాదాపు 20 మంది తృణమూల్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసి, ఎన్‌డీఏలో భాగం కావాలన్న తమ కోరికను అధికారికంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నామని ఘోష్ దస్తిదార్ ఈరోజు విలేకరులతో చెప్పారు.

తిరుగుబాటు తృణమూల్ ఎంపీ షర్మిల సర్కార్‌ మాట్లాడుతూ, “మేము 20 మంది ఎంపీలతో వేరే కూటమిని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వబోతున్నాం. కాకోలి ఘోష్ దస్తిదార్ మా ప్రధాన విప్, శతాబ్ది రాయ్ మా ఉప నాయకురాలు” అన్నారు.

మమతాకు బిగ్ షాక్.. TMCపై సంచలన వ్యాఖ్యలు

పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేలు ఒక కూటమిని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో శివసేన అనుసరించిన విధానంలోనే తమది “నిజమైన” తృణమూల్ అని ప్రకటిస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా శోభన్‌దేబ్ చటర్జీని పార్టీ ఎంపిక చేయడమే వారి అసంతృప్తికి కారణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement