తగ్గేదేలే.. ఇంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి పీకే.. బీహార్‌ నుంచే మొదలు!

Time to Go to Real Masters Says Prashant Kishor His New Move - Sakshi

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌(పీకే) ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు దాదాపుగా సంకేతాలిచ్చిన ఆయన.. అవసరమైతే రాజకీయ పార్టీ ఆలోచన కూడా చేస్తున్నట్లు ప్రకటించేశారు.

ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన ఒక ట‍్వీట్‌ చేశారు. పదేళ్ల రోలర్‌ కోస్టర్‌ ప్రయాణం తర్వాత.. అంటూ ట్వీట్‌ చేశారు. ఇంతకాలం ప్రజల పక్షాన విధివిధానాలు రూపొందించినట్లు ట్వీట్‌ చేసిన ఆయన.. ఇక నుంచి జన్‌ సురాజ్‌.. (ప్రజలకు సుపరిపాలన) దిశగా అడుగులు వేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ ట్వీట్‌తో ఆయన  ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు దాదాపు ఖరారు కాగా.. బీహార్‌ నుంచి తన ప్రయాణం మొదలుపెడుతున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం పెద్ద ఎతున్న నడిచింది. అయితే ఆఖర్లో కీలక పదవికి కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి విముఖత వ్యక్తం కావడం, ప్రాధాన్యత లేని పదవిని కాంగ్రెస్‌ ఆయనకు ఆఫర్‌ చేయడంతో పార్టీలో చేరే ఆలోచనను విరమించుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఒకప్పుడు రాజకీయ వ్యూహకర్తగా బీహార్‌లో నితీశ్‌కుమార్‌ను గద్దె ఎక్కించడంలో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్‌ కిషోర్‌. ఇప్పుడు అక్కడి నుంచే ప్రత్యక్ష రాజకీయాల ప్రకటన చేయడం గమనార్హం.

చదవండి: కాంగ్రెస్‌లో చేరకపోవడానికి కారణం చెప్పిన పీకే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top