TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా | telangana HC adjourns hearing on disqualification petitions of mlas | Sakshi
Sakshi News home page

TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా

Jul 3 2024 1:41 PM | Updated on Jul 3 2024 1:46 PM

telangana HC adjourns hearing on disqualification petitions of mlas

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.

కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, కడియం శ్రీహరిని అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే  ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణ కోసం సోమవారానికి వాయిదా వేసింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement