ఢీల్లీకి డీకే శివకుమార్‌.. సీఎం ప్రమాణస్వీకారం వాయిదా

Telangana Congress Lp Leader Selection Postponed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.  తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్‌తో  పాటు మరో నలుగురు అబ్జర్వర్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో పరిశీలకులు సమావేశమవనున్నారు.దీంతో ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లేనని సమాచారం. 

కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల(సీఎల్పీ)సమావేశం సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఎల్లాహోటల్‌లో జరిగింది. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు.  ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎల్పీ నేతల ఎన్నిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేసి హైకమాండ్‌కు పంపారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత పేరుపై క్లారిటీ వస్తుందని అంతా ఎదురు చూశారు. కానీ చివరకు డీకే శివకుమార్‌ సహా నలుగురు ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో సీఎల్పీ నేత ఎంపిక వాయిదా పడింది. 

మరోపక్క తెలంగాణ రెండవ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్‌ మూడో శాసనసభను గెజిట్‌లో నోటిఫై చేశారు. జీఏడీ అధికారులు కూడా సీఎం ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్‌ని కూడా రెడీ చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం సీఎల్పీ నేత ఎవరో వెల్లడించిన వెంటనే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని అంతా భావించారు. చివరకు పరిశీలకులు ఢిల్లీ  వెళ్లడంతో సీఎల్పీనేత ఎంపికతో పాటు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఇవాళ లేనట్లేనని తేలిపోయింది. సీఎం ప్రమాణ స్వీకారం వాయిదాపడిందని తెలియడంతో రాజ్‌భవన్‌ నుంచి పోలీసులు, అధికారులు వెళ్లిపోయారు. 

ఇదీచదవండి..తెలంగాణలో కొలువుదీరనున్న కొత్త సర్కార్‌.. అప్‌డేట్స్‌

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

04-12-2023
Dec 04, 2023, 18:33 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఐదుసార్లు ఓటమి చవిచూసిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కలను ఆయన కొడుకు కూచుకుళ్ల...
04-12-2023
Dec 04, 2023, 17:25 IST
సాక్షి, వరంగల్‌: కాంగ్రెస్‌ గెలుపులో యువత కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కొత్త ఓటర్లు, నిరుద్యోగ యువకులు దాదాపు హస్తానికి అండగా నిలిచినట్లు...
04-12-2023
Dec 04, 2023, 15:38 IST
సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రాలేదని బీజేపీ స్టేట్‌ చీఫ్‌ కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పార్టీ...
04-12-2023
Dec 04, 2023, 09:25 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. కాంగ్రెస్‌ను భారీ మెజార్టీలో ప్రజలు గెలిపించారు. దీంతో, ప్రభుత్వ ఏర్పాట్లకు కాంగ్రెస్‌...
04-12-2023
Dec 04, 2023, 08:21 IST
సాక్షి, యాదాద్రి: కోమటిరెడ్డి సోదరులు ఎమ్మెల్యేలుగా ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 1999 నుంచి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,...
04-12-2023
Dec 04, 2023, 08:11 IST
హసన్‌పర్తి : ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపు పొంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గతంలో...
04-12-2023
Dec 04, 2023, 07:25 IST
పాలకుర్తి అసెంబ్లీ చరిత్రలో తొలిసారి 26 ఏళ్ల పిన్న వయస్కురాలిగా యశస్విని గెలుపొందారు.
04-12-2023
Dec 04, 2023, 06:04 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మిశ్రమ ఫలితాలిచ్చాయి. గతంతో పోలిస్తే సీట్లు, ఓట్లు పెరిగినా అధికారంలోకి...
04-12-2023
Dec 04, 2023, 05:51 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో...
04-12-2023
Dec 04, 2023, 05:45 IST
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేశా యి. పార్టీకి పట్టున్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో...
04-12-2023
Dec 04, 2023, 05:32 IST
సాక్షి, హైదరాబాద్‌/ కామారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పెను సంచలనం సృష్టించారు. కామారెడ్డి నుంచి సీఎం...
04-12-2023
Dec 04, 2023, 05:20 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పది మంది గెలుపొందారు....
04-12-2023
Dec 04, 2023, 05:00 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంకు ఘోర పరాభవం మిగిలింది. ఒంటరిగా పోటీచేసిన 19 స్థానాల్లోనూ దాదాపు అన్నిచోట్లా...
04-12-2023
Dec 04, 2023, 04:36 IST
సాక్షి, హైదరాబాద్‌/ ఆసిఫాబాద్‌: బహుజన సమా­జ్‌ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజన­వాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన...
04-12-2023
Dec 04, 2023, 04:22 IST
సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష...
04-12-2023
Dec 04, 2023, 01:52 IST
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి ఊపిరిపోశాయి. 20 ఏళ్లలో ఏనాడూ చూడని స్పష్టమైన...
04-12-2023
Dec 04, 2023, 01:20 IST
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పుతో ఈ ఎన్నికల్లో తమ వైవిధ్యాన్ని చాటారు. తూర్పున...
04-12-2023
Dec 04, 2023, 01:04 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్‌ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ నోటాకు ఓట్లు పోలయ్యాయి. ఆదివారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల...
04-12-2023
Dec 04, 2023, 01:04 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ఉమ్మడి జిల్లాలో నోటాకు ఓటేసిన వారి సంఖ్య ఈ ఎన్నికల్లో కాస్త తగ్గింది. చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు...
03-12-2023
Dec 03, 2023, 21:18 IST
సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సీఎల్పీ) సమావవేశంలో సోమవారం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని డీకే శివకుమార్‌ తెలిపారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ... 

Read also in:
Back to Top