ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర ఆదివారం కలిశారు. ఈ మేరకు అమిత్ షా నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లిన ఈటల.. ఈరోజు కలిసి తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పార్టీ స్థితిగతులను వివరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలను ఈటల వివరించారు.
దీనిలో భాగంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని అమిత్ షా సూచించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తన సేవలను ఉపయోగించుకోవాలని అమిత్ షాకు ఈటల తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
