తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌ | Telangana Assembly Elections 2023 Today Live Updates And Election Campaigns On 27th November - Sakshi
Sakshi News home page

TS Assembly Elections Updates 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

Published Mon, Nov 27 2023 6:29 AM

Telangana Assembly Elections Today Updates On 27 November - Sakshi

Telangana Assembly Elections Today Minute To Minute Update..

రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్: హరీష్ రావు

  • కాంగ్రెస్ పాలన అంతా చీకటిమయమే
  • కరెంట్ కష్టాలు, నీటి కష్టాలను ప్రజలు మర్చిపోలేదు
  • అర్ధరాత్రి రైతులను గోస పెట్టి పార్టీ కాంగ్రెస్
  • కాంగ్రెస్ పార్టీ రైతులను ఏనాడు పట్టించుకోలేదు
  • రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్
  • నకిలీ విత్తనాలతో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
  • కాంగ్రెస్ పార్టీ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులుగా పేర్లు మారిపోయాయి.
  • వ్యవసాయం దండగ అంటున్న నాయకునికి వారసుడు రేవంత్
  • రైతు బంధు ఆపాలని కుట్ర
  • కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రైతు వ్యతిరేక పార్టీనే
  • కాంగ్రెస్ గెలవగానే కర్ణాటకలో రైతు బంధు బంద్ అయింది

ముగిసిన మోదీ రోడ్‌ షో

  • రోడ్ షోలో కాచిగూడ చేరుకున్న ప్రధాని మోదీ
  • ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు జరిగిన ప్రధాని మోదీ రోడ్ షో
  • సావర్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మోడీ
  • రాత్రి 7.30 నుంచి 7.40 వరకు గురుద్వారా లో ప్రధాని మోడీ ప్రార్థనలు
  • కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రానున్న ప్రధాని మోదీ 

హైదరాబాద్‌లో ప్రారంభమైన మోదీ రోడ్‌ షో 

  • చిక్కడపల్లి నారాయణగూడ మీదుగా  సాగుతున్న రోడ్‌ షో
  • ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ నుంచి కాచిగూడ వరకు 2.5 కిలోమీటర్లు రోడ్‌ షో
  • ప్రధాని వెంట వాహనంపై కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌
  • ర్యాలీలో పాల్గొన్న 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు
  • భవనాలపై నుంచి మోదీకి అభివాదం చేస్తున్న ప్రజలు 
  • మోదీపై పూల వర్షం కురిపిస్తున్న అభిమానులు 

సంగారెడ్డిలో కేసీఆర్‌ కామెంట్స్‌ 

  • ఓటు మన తలరాతను మారుస్తుంది 
  • తెలంగాణలో పదేళ్లలో జరిగిన అభివృద్ధి చూడండి 
  • ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
  • తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంటు, నీరు సరిగా ఇచ్చుకున్నాం
  • ఉన్న తెలంగాణను ఊడగొట్టిదే కాంగ్రెస్‌
  • 50 ఏళ్లకుపైగా మనం గోసపడ్డాం
  • ఓటు సరిగ్గా వినియోగించుకోవాలని కోరుతున్నా 
  • గతంలో మంచి నీళ్లకు ఇబ్బంది పడ్డాం 
  • రైతుబంధుతో దుబారా అని కాంగ్రెస్‌ అంటోంది
  • రైతుబంధు ఉండాలా వద్దా 

హైదరాబాద్‌ చేరుకున్న ప్రధాని మోదీ

  • కాసేపట్లో హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌ షో
  • ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ నుంచి కాచిగూడ వరకూ ప్రధాని మోదీ రోడ్‌ షో

కొడంగల్‌ ఎన్నికల ప్రచార సభలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

  • కొడంగల్‌ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది
  • మీరు అండగా ఉన్నంత వరకూ మోదీ, కేసీఆర్‌ ఎవరైనా కొట్లాడుతా

ప్రజల చెమట, రక్తంతో రాష్ట్రం ఏర్పడింది: ప్రియాంక గాంధీ

  • చరిత్రలో ఫామ్‌హౌజ్‌ నుంచి పాలన చేసిన సీఎం మరొకరు ఉండరు
  • రాష్ట్రంలో ప్రజలు అప్పులపాలయ్యారు
  • దొరల తెలంగాణ బలపడింది.. ప్రజలు బలహీనులయ్యారు
  • చైతన్యవంతులు కాకపోతే నష్టపోయేది మీరే
  • ప్రజల ఆందోళనలు, పోరాటాలతో రాష్ట్రం ఏర్పడింది
  • ప్రజల చెమట, రక్తంతో రాష్ట్రం ఏర్పడింది.
  • కేసీఆర్ పదేళ్లలో అవినీతికి పాల్పడ్డారు
  • తెలంగాణలో బీఆర్‌ఎస్ సంపన్నపార్టీ
  • ప్రపంచంలోనే బీజేపీ అధిక సంపన్నమైన పార్టీ
  • కేంద్రంలో అవసరమైనప్పుడు బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతునిస్తుంది
  • ల్యాండ్, శాండ్, మైన్ మాఫియాతో ప్రభుత్వం కూరుకుపోయింది
  • మీ ఓటును వ్యర్థం చేసుకోకండి
  • తెలంగాణ వికాసం కోసమే రేవంత్ నాతో ఉన్నారు
  • మీ ఆశను నెరవేర్చేందుకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు
  • తెలంగాణ ఏర్పడితే మన ప్రభుత్వం వస్తుందని అంతా భావించారు
  • కొడంగల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ

ఆందోల్‌ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్‌

  • రైతుబంధును కాంగ్రెస్‌ వాళ్లే ఆపేశారు
  • కాంగ్రెస్‌ నేతలకు అసలు సిగ్గుందా?
  • కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతోనే ఈసీ రైతు బంధు నిలిపేసింది
  • రైతుబంధును ఆపేస్తే కాంగ్రెస్‌ వాళ్లకు కూడా నష్టమే
  • రైతుబంధు తీసుకుంటున్న వాళ్లలో కాంగ్రెస్‌ వాళ్లు కూడా ఉన్నారు
  • ధరణి ఉండాలా? వద్దా?
  • ధరణిని తీసేయాలని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు
  • ధరణిని తీసేస్తే మళ్లీ వచ్చేది దళారుల రాజ్యమే
  • ధరణి స్థానంలో భూమాత తెస్తారట. అది భూమాత కాదు.. భూమేత
  • రైతులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు?
  • ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు
  • ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు
  • ఇందిరమ్మ రాజ్యంతోనే కదా తెలంగాణ నాశనమైంది

కరీంనగర్‌లో  మోదీ కామెంట్స్‌ 

  • ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారతదేశం
  • తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు 
  • పోలింగ్‌ రోజు ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారు 
  • తెలంగాణలో కేసీఆర్‌ పని అయిపోయింది 
  • తెలగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది 
  • బీజేపీ  ప్రభుత్వంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కానున్నారు 
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాం
  • బీజేపీ సర్కారు వస్తేనే తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయి
  • మోదీ అంటే కేసీఆర్‌కు భయం
  • మోదీ వస్తే ఎయిర్‌పోర్టుకు కూడా రాకుండా తప్పించుకునేవారు
  • ప్రజలను దోచుకోవడమే బీఆర్‌ఎస్‌ నేతల పని
  • మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తవుతుంది
  • నీళ్లు, నిధులు నియామకాలు ఏమయ్యాయి?
  • బీఆర్‌ఎస్‌ పాలనలో కష్టాలు, కన్నీళ్లు
  • కేసీఆర్‌ కుటుంబ కోసమే తెలంగాణ ఏర్పడిందా?
  • డిసెంబర్‌ 3 తర్వాత లిక్కర్‌ స్కాంపై దర్యాప్తు వేగవంతం చేస్తాం
  • రైతులకు నీళ్లిచ్చేందుకు కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారు
  • తెలంగాణలో నీటి ప్రాజెక్టులు బీఆర్‌ఎస్‌కు ఏటీఏంలా మారిపోయాయి

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సూట్‌ కేసుల ప్రభుత్వం వస్తుంది: కిషన్‌రెడ్డి

  • తెలంగాణకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రమాదకరం
  • గజ్వేల్‌, కామారెడ్డిలో కేసీఆర్‌ ఓడిపోతున్నారు
  • మోదీని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి డ్రామా చేస్తున్నాయి
  • కామారెడ్డిలో కేసీఆర్‌ను గెలిపించడానికి రేవంత్‌ పోటీ చేస్తున్నారు
  • తెరవెనుక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు
  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలనలో పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చేయలేదు?
  • ఇన్నాళ్లు పాతబస్తీ యువతకు ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించలేదు
  • ఒవైసీ కుటుంబం శాసిస్తే కేసీఆర్‌ ఏదైనా చేస్తారు
  • పాతబస్తీకి మెట్రో వసతి ఎందుకు కల్పించలేకపోయారు
     

 మరికాసేపట్లో హైదరాబాద్‌లో మోదీ రోడ్ 

  • రోడ్‌ షోలో పాల్గొననున్న గ్రేటర్ పరిధిలోని 24 మంది బీజేపీ అభ్యర్థులు
  • రెండున్నర కిలోమీటర్ల మేర సాగనున్న రోడ్ షో
  • రోడ్ షోకు భారీ ఏర్పాట్లు
  • ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ సావర్కర్ విగ్రహం వరకు సాగనున్న ప్రధాని రోడ్ షో
  • ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదలనున్న ప్రధాని
  • రోడ్ షో నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కేంద్ర బలగాలు
  • ఆర్టీసి క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు ట్రాఫిక్ ఆంక్షలు

గద్వాల్‌లో ప్రియాంక కామెంట్స్‌

  • ఎంత పేదవారైనా తమ పిల్లలను మంచి చదువులు చదివించాలనుకుంటారు
  • తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనుకున్నారు 
  • కానీ అది కలగానే ఉండిపోయింది 

చెన్నూరులో కేటీఆర్‌ కామెంట్స్‌

  • అయిదేళ్లలో  చెన్నూరు రూపు రేఖలు మార్చిన సుమన్‌కు అభినందనలు 
  • రైతుబంధు వేస్తే కేసీఆర్‌ ప్రభుత్వం గెలుస్తుందని రేవంత్ రెడ్డి ఈసీకి ఉత్తరం రాసిండు
  • ఈసీ రైతు బంధును ఆపేసింది
  • రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు ఉండదు
  • 24 గంటల కరెంటు ఉండదు
  • 10 హెచ్‌పీ మోటార్ చాలు
  • 3 గంటల కరెంట్ చాలు అని రేవంత్‌రెడ్డి అంటాడు 
  • కర్ణాటక నుంచి వచ్చినోడు 5 గంటలు చాలు అంటాడు
  • 30 తారీఖున ఓటు వేసే ముందు కరెంట్ కావాల్నా, కాంగ్రెస్ కావాల్నా ఆలోచించండి
  • కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు
  • కాంగ్రెస్‌కు కరెంటు గురించి అడిగే నైతిక హక్కు లేదు
  • దరిద్రానికి నేస్తం హస్తం..అది నెత్తి మీద పెట్టుకుంటే భస్మం అయిపోతాం  

రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ రావాలి.. షాద్‌ నగర్‌ సభలో  సీఎం కేసీఆర్‌

  • చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నాం 
  • కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం
  • పార్టీల చరిత్ర చూసి ప్రజలు ఓటేయాలి
  • అభ్యర్థులు ఎలాంటి వారో అన్నీ చూసి  ఓటేయాలి
  • కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్నీ బాధలే
  • అధికారంలోకి వచ్చాక పెన్షన్‌ రూ.5వేల వరుకు ఇస్తాం
  • రైతు బంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు
  • రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావాలి

కాంగ్రెస్‌లో చేరిన అశ్వద్ధామ రెడ్డి

  • కాంగ్రెస్‌లో చేరిన టీఎస్‌ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వద్ధామ రెడ్డి.
  • జైరాం రమేష్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
  • కాంగ్రెస్‌కు మద్దతు పలికిన ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌
  • ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన అశ్వద్ధామ రెడ్డి. 

తెలంగాణలో కొత్త చరిత్ర లిఖించబోతున్నాం: మోదీ

  • మహబూబాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
  • ప్రధాని మోదీ కామెంట్స్‌..
  • తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతుంది. 
  • బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీని సీఎం చేస్తాం. 
  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తెలంగాణను నాశనం చేశాయి. 
  • తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. 
  • బీజేపీతో ఎలాగైన దోస్తీ చేయాలని కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చారు. 
  • నేను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా ఉండదలచుకోలేదు. 
  • బీఆర్‌ఎస్‌ను బీజేపీ ఎప్పుడూ దగ్గరకు రానివ్వదు.
  • ఎన్డీయేలో చేర్చుకోవట్లేదని బీఆర్‌ఎస్‌ నేతలు నన్ను తిట్టడం మొదలుపెట్టారు. 
  • మా దరిదాపుల్లోకి కూడా బీఆర్‌ఎస్‌ను రానివ్వం, ఇది మోదీ గ్యారంటీ.
  • తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారు. 
  • బీజేపీ ఇచ్చే గ్యారంటీ తప్పకుండా అమలవుతుంది. 
  • తెలంగాణను కేసీఆర్‌ మూఢనమ్మకాల రాష్ట్రంగా మార్చారు. 
  • మూఢనమ్మకాలతో సచివాలయాన్ని నాశనం చేశారు. 
  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌.. దళితులు, బీసీలను మోసం చేశారు. 
  • తెలంగాణకు ఫామ్‌హౌస్‌ సీఎం అవసరం లేదు. 
  • బీఆర్‌ఎస్‌లో స్కామ్‌లు చేసిన వారిని జైలుకు పంపిస్తాం. 
  • ల్యాండ్‌, లిక్కర్‌, పేపర్‌ లీక్‌ మాఫియాలను జైలుకు పంపిస్తాం. 
  • స్కామ్‌ చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టం. 
  • బీఆర్‌ఎస్‌ చేసిన స్కాములు అన్నింటిపైనా దర్యాప్తు చేయిస్తాం. 
  • అణగారిన వర్గాలకు బీజేపీనే సంక్షేమం అందిస్తోంది. 
  • కొమురం భీమ్‌ మ్యూజియం రెడీ అవుతోంది.

హుజురాబాద్‌లో అమిత్‌ షా కామెంట్స్‌..

  • హుజురాబాద్‌లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు అమిత్‌ షా హాజరు.
  • బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం ఆసన్నమైంది.
  • బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారు. 
  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే కుటుంబ పాలన వస్తుంది. 
  • బీజేపీకి ఓటు వేస్తే ప్రజా పాలన వస్తుంది. 
  • భారీ మెజార్టీలో ఈటల రాజేందర్‌ను గెలిపించండి. 
  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య డీల్‌ కుదిరింది. 
  • 2024లో కూడా మోదీనే ప్రధాని అవుతారు. 
  • కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్టే. 
  • బీఆర్‌ఎస్‌ వేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే. 
  • తెలంగాణకు కేంద్రం రూ.7లక్షల కోట్లను అందజేసింది. 
  • బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్‌ భేటీలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తాం. 

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్‌

  • సీఎం కేసీఆర్‌కు బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. 
  • మెడికల్‌ కాలేజీల కోసం కేసీఆర్‌ రాసిన 50 లేఖలు బయటపెడితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. 
  • కేసీఆర్‌ మాటాల్లో వాడీవేడీ తగ్గింది. 

బొగ్గుగనుల ప్రైవేటీకరణను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది: పొంగులేటి

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జగదాంబ సెంటర్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి.
  • బిఆర్ఎస్ పార్టీ  దొంగల పార్టీ.
  • అబద్దాలు చెప్పి రెండు పరియాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్.
  • బీఆర్ఎస్ ద్రోహులను పారదోలి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి.
  • ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలు ప్రజలు సుఖా సంతోషాలతో ఉంటారు.
  • డిసెంబర్ 9వ తారీకు హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.
  • 12 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వాల్సి ఉండగా నాలుగు లక్షల ఎకరాలకే పట్టాలిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది.
  • కేంద్రంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు.
  • కాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు.
  • ఇందిరమ్మ రాజ్యం వస్తే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
  • రైతులకు రెండు లక్షల రుణమాఫీ.
  • కాంగ్రెస్ వస్తే నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తాము.
  • అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఫించన్ లు ఇస్తాం.
  • నిరుపేదలకు ఇండ్ల స్థలం తో పాటు డబల్ బెడ్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బొడు, కోమరారం మండలాలను ఏర్పాటు చేస్తాం.
  •  బీఆర్‌ఎస్ డబ్బులు ఇస్తే తీసుకోండి. ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేయండి.

హరీష్‌రావు వల్లే రైతు బంధు నిలిచిపోయింది.. డోర్నకల్‌ సభలో రేవంత్‌

  • హరీష్‌ వ్యాఖ్యల వల్లే రైతు బంధు నిలిపేసినట్లు సీఈసీ తెలిపింది
  • కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం
  • కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రూ.4వేల పెన్షన్‌ ఇస్తాం
  • పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు స్వస్తి పలకాలి

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: సచిన్‌ పైలట్‌

  • తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సచిన్‌ పైలట్‌
  • గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 
  • తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.
  • ప్రజల్లో మంచి స్పందన ఉంది.
  • రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకా గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుంది.
  • కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదు.
  • నిరుద్యోగం పెరిగి పోతున్నది. 
  • ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు.
  • భారత్ జోడోయాత్ర ద్వారా రాహుల్ గాంధీ  4 వేల కిలోమీటర్ల పాదయాత్ర  చేశారు.
  • ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.
  • నవంబర్‌ 30వ  తేదీ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలి.
  • కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వారికి క్రెడిబిలిటి లేదు.
  • ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.
  • కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుంది.
  • ఓట్ ఫర్ చేంజ్..
  • మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు.
  • రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండి.
  • రాజస్థాన్‌లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది.
  • సంప్రదాయాన్ని బ్రేక్ చేసి రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి రాజస్థాన్‌కు ఎలాంటి సహకారం ఇవ్వలేదు.
  • ప్రజలు అర్ధం చేసుకున్నారు..
  • ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. 
  • సీఎం అభ్యర్థి అనేది కాంగ్రెస్‌లో ఉండదు.
  • అధిష్టానమే సీఎంని సెలెక్ట్ చేస్తుంది.

​కాసేపట్లో వికాస్‌రాజ్‌తో కేశవరావు భేటీ..

  • కాసేపట్లో సీఈఓ వికాస్ రాజ్‌తో భేటీ కానున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేకే
  • రైతు బంధుకు ఈసీ అనుమతి ఇచ్చి వెనక్కు తీసుకోవడంపై ఫిర్యాదు 
  • కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపైన ఈసీకి వివరించనున్న బీఆర్ఎస్ నేతలు

రైతుబంధు నిలిపివేతపై హరీశ్‌ కామెంట్స్‌..

  • ఎన్నికల వేళ ఎలక్షన్‌ కమిషన్‌ రైతుబంధు నిలిపివేయడంపై మంత్రి హరీశ్‌ రావు స్పందన
  • రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. 
  • రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. 
  • వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తామన్నారు. 
  • తెలంగాణ రైతులతో కేసీఆర్‌ది పేగుబంధం మాది. 
  • కాంగ్రెస్‌ పార్టీ రైతుల నోటికాడ బుక్కను లాక్కుంది. 
  • నేను మీటింగ్‌లో న్యాయం గెలిచిందని.. రైతుబంధుకు ఈసీ క్లియరెన్స్‌ ఇచ్చిందని అన్నాను. 
  • రైతుబంధును ఆపిన కాంగ్రెస్‌కు ఓటుతోనే పోటు పొడవాలి. 
  • రైతుబంధు రావాలంటే కాంగ్రెస్‌ ఖతమ్‌ కావాలి. 
  • ఎకరాకు రైతుబంధు కాదు.. ఒక్కో రైతుకు 15వేలు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది.
  • మేము ఓట్ల కోసం రైతుబంధు తీసుకురాలేదు. 
  • కేసీఆర్‌ వస్తే పెన్షన్‌ రూ.5వేలు ఇస్తాం. 
  • సౌభాగ్యలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తాం. 
  • పేదలకు రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. 
  • రేషన్‌కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తాం. 
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఝురాసంఘంలో ఆరువేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇస్తాం.

ప్రారంభమైన ఈసీఐ వీడియో కాన్ఫరెన్స్

  • తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న సీఈఓ వికాస్ రాజ్ అండ్ టీం
  • హాజరైన డీఈవోలు, ఆర్వోలు, పోలీస్ అధికారులు
  • ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీకి వివరించనున్న సీఈఓ వికాస్ రాజ్
  • చివరి రెండు రోజుల పై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి
  • డబ్బు, మద్యం కట్టడి పై చర్యలు తీసుకోవాలని సీఈసీ ఆదేశాలు

రోడ్‌ షోలో కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

  • సుల్తానాబాద్‌లో కేటీఆర్‌ రోడ్‌ షో
  • బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాసరి మనోహర్‌ రెడ్డికి మద్దతుగా ప్రచారం
  • బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే సంక్షేమం, అభివృద్ధి అందుతాయి. 
  • 55 ఏళ్లలో ఏమీ చేయనివారు ఇప్పడు ఏం చేస్తారు. 
  • కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. 
  • కాంగ్రెస్‌కు అవకాశమిస్తే కరెంట్‌, రైతుబంధు ఆగిపోతాయి. 
  • కాంగ్రెస్‌ పార్టీ కొత్త కుట్రకు తెరలేపింది. 
  • రైతుబంధు వేయకుండా కాంగ్రెస్‌ అడ్డుకుంది. 
  • అధికారంలోకి రాకముందే రైతుబంధును అడ్డుకున్నారు.
     

కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..

  • ఎన్నికల్లో ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లక్ష్యం.
  • కుటుంబ రాజకీయాలకు తెరదించాలంటే కేసీఆర్‌ను గద్దె దించాలి. 
  • గజ్వేల్‌, కామారెడ్డిలోనూ బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. 
  • ప్రధాని నరేంద్ర మోదీ సభలకు జనం నీరాజనాలు పడుతున్నారు. 
  • యువత, మహిళలు, రైతులు బీఆర్‌ఎస్‌పై ఆగ్రహంతో ఉన్నారు. 

రైతుబంధుపై రేవంత్‌ ఆసక్తికర కామెంట్స్‌

  • బీఆర్‌ఎస్‌పై రేవంత్‌ ఫైర్‌
  • ‘రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం
  • నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు. 
  • హరీశ్‌ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు  ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. 
  • ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. 
  • రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. 
  • పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం

కాంగ్రెస్ నేతలు వెంటపడి మరి రైతు బంధును ఆపించారు.. మీడియాతో ఎమ్మెల్సీ కవిత

  • రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ప్రియాంక​ చదువుతున్నారు
  • బీజేపీ హయాంలో పెద్ద కంపెనీలే బాగుపడ్డాయి
  • దండయాత్రకు వచ్చినట్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు
  • సింగరేణిని ప్రైవేట్‌కు అప్పగించింది కాంగ్రెస్‌ పార్టీ
  • తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ నేతలంతా ఎక్కడ ఉన్నారు?
  • రాహల్‌ గాంధీ జోడో యాత్రలో తెలంగాణ  ప్రస్తావన లేదు
  • కాంగ్రెస్ నాయకులు వెంటబడి రైతు బంధును ఆపించారు
  • అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేశారు
  • కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకుంది
  • నోటి కాడి బుక్కను లాక్కున్నారు కాబట్టి రైతులు ఆలోచించి ఓటు వేయాలి
  • మంచోల్లు కావాలా ముంచే వాళ్లు కావాలా?
  • 24 గంటల కరెంటు కావాలా, 3 గంటల కరెంట్ కావాలా?.
  • కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాల్లో ఇంతవరకూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు.
  • మతం పేరుతో మంట పెట్టాలని ఒక పార్టీ, కులం పేరుతో చిచ్చు పెట్టాలని మరో పార్టీ చూస్తుంది

బీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన ఈసీ..

  • రైతుబంధుకు బ్రేక్‌
  • రైతుబంధు నిధులను నిలిపివేయాలని ఈసీ ఆదేశం
  • గత వారం రైతుబంధుకు అనుమతించిన ఈసీ..
  • రైతుబంధుపై ఫిర్యాదులు రావడంతో ఈసీ కీలక నిర్ణయం

భారీగా నగదు స్వాధీనం..

  • ఖమ్మం, పెద్దపల్లిలో భారీ నమోదు స్వాధీనం
  • ఖమ్మంలోని శ్రీరామ్‌నగర్‌లో ఓ ఇంట్లో సరైన పత్రాలు లేకుండా మూడు కోట్లు.
  • నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.
  • అలాగే, పెద్దపల్లిలోని ఎన్టీపీసీలో కృష్ణనగర్‌లోని ఓ తాళం వేసిన ఇంట్లో భారీ నగదు గుర్తింపు, స్వాధీనం.
  • ఓ జాతీయ పార్టీకి చెందిన కరపత్రాలతో పాటు రెండు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఎఫ్‌ఎస్‌టీ టీమ్‌.

నేడు పెద్దపల్లిలో కేటీఆర్‌ ప్రచారం

  • మంత్రి కేటీఆర్‌ నేడు పెద్దపల్లిలో పర్యటించనున్నారు. 
  • బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి దాసరి మనోహర్‌ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం
  • సుల్తానాబాద్‌లో రోడ్‌ షోలో పాల్గొననున్న కేటీఆర్‌

భారీ వర్షం.. ప్రచారంపై ఎఫెక్ట్‌

  • ఆదిలాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది
  • వర్షం ఎఫెక్ట్‌ ఎన్నికల ప్రచారంపై పడే అవకాశం ఉంది. 
  • నేడు ఛతీస్తగఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ ఎన్నికల ప్రచారం
  • ఎన్నికల రోడ్‌ షోలో పాల్గొననున్న భూపేశ్‌ బఘేల్‌
  • ఆయన రోడ్‌ షోపై వర్షం ఎఫెక్ట్‌ 


భువనగిరిలో ప్రియాంక ప్రచారం

  • కాంగ్రెస్‌ ప్రియాంక గాంధీ నేడు భువనగిరిలో ప్రచారం
  • ఉదయం 11:30 గంటలకు రోడ్‌ షోలో ప్రియాంక
  • భువనగిరిలో భారీ ర్యాలీకి ప్లాన్‌ చేసిన కాంగ్రెస్‌

కరీంనగర్‌లో నేడు మోదీ పర్యటన

  • ప్రధాని మోదీ నేడు కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం
  • మధ్యాహ్నం ఒంటి గంటకు ఎస్‌ఎస్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ సభ
  • బీజేపీ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ

అమిత్‌ షా షెడ్యూల్‌ ఇలా..

  • ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
  • జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం పది గంటలకు అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ప్రచారం.
  • మధ్యాహ్నం పెద్దపల్లిలో పర్యటించనున్న అమిత్ షా
  • బీజేపీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్ రావుతో కలిసి రోడ్డు షోలో ప్రచారం చేయనున్న అమిత్ షా.
  • జగిత్యాలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్ షో..
  • జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణికి మద్దతుగా ప్రచారం.

30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుంది.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 

  • మా రాష్ట్రం వస్తే గ్యారంటీల అమలు చూపిస్తాం
  • ముషీరాబాద్, మక్తల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల తరపున ప్రచారం  

ఈ రెండు రోజులూ కీలకం

  • బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమీక్ష  
  • ప్రచారం ఉధృతం చేయండి
  • పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టండి 
  • గట్టి పోటీ ఇస్తున్న 45–50 సీట్లలో ఎక్కువ గెలవాలి 

నేడు మోదీ, అమిత్‌షా సహా ముఖ్యనేతల ప్రచారం 

  • మహబూబాబాద్, కరీంనగర్‌లలో మోదీ బహిరంగసభ 
  • జేపీ నడ్డాతో సహా కొందరు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు సోమవారం విస్తృత ప్రచారం
  • మహబూబాబాద్, కరీంనగర్‌లలో బహిరంగసభలతో పాటు హైదరాబాద్‌లో మోదీ రోడ్‌షో
  • అనంతరం ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవంలో పాల్గొననున్న మోదీ
  • గురుద్వారాను సందర్శించిన అనంతరం ఢిల్లీకి తిరుగు పయనం
  • హుజూరాబాద్‌లో బహిరంగసభ, పెద్దపల్లి, మంచిర్యాలలో అమిత్‌షా రోడ్‌షో
  • అనంతరం బేగంపేట నుంచి ఢిల్లీకి..
  • సోమవారం ఉదయం జగిత్యాలలో రోడ్‌షో అనంతరం బోధన్, బాన్సువాడ, జుక్కల్‌ బహిరంగసభల్లో పాల్గొననన్ను జేపీ నడ్డా
  • దేవరకద్ర, మంథని సభల్లో, పరకాలలో రోడ్‌షో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ
  • హనుమకొండలోని విష్ణుపురి గార్డెన్స్‌లో ఐటీ ఇంటలెక్చువల్‌ మీట్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌
  • సిద్దిపేటలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌
  • అలంపూర్‌లో పార్టీ నాయకు లు, కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్న కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్‌

మంచినీరు, కరెంటు వస్తేనే కారుకు ఓటేయండి.. సాక్షిటీవీ లైవ్‌షోలో మంత్రి హరీశ్‌రావు

  • ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాటిని కూడా నెరవేర్చాం 
  • కర్ణాటకలో కాంగ్రెస్‌ జనాన్ని మోసం చేసింది 
  • కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ సీఎం కాదు...ఫామింగ్‌ సీఎం
  • మేం 12 సార్లు రైతుబంధు ఇచ్చాం. కాంగ్రెస్‌ వస్తే 12 మంది ముఖ్యమంత్రులు  
  • ప్రభుత్వ పథకాలపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం తిప్పికొడుతున్నాం
  • కాళేశ్వరంతో రాష్ట్రం సస్యశ్యామలం 

అలంపూర్ కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ సోదాలు

  • శాంతినగర్‌లో ఆయన నినాసంలో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు
  • సృహతప్పి పడిపోయిన సంపత్ కుమార్  భార్య
  • సంపత్ కుమార్ ఇంటికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు


Advertisement
Advertisement