‘నామినేషన్‌ ఎలా వేస్తావో.. చూస్తా’ | TDP Rowdies Attack On YSRCP Leaders | Sakshi
Sakshi News home page

‘నామినేషన్‌ ఎలా వేస్తావో.. చూస్తా’

Oct 23 2026 11:30 AM | Updated on Oct 23 2026 11:33 AM

TDP Rowdies Attack On YSRCP Leaders

సింగవరం వైఎస్సార్‌సీపీ నేత బూరుగయ్యను బెదిరిస్తున్న టీడీపీ మద్దతుదారులు

నంద్యాల: స్థానిక ఎన్నికలలో టీడీపీ నేతల అరాచకాలు శ్రుతిమించుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు కనీసం నామినేషన్‌ వేసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. నామినేషన్‌ కేంద్రాల వద్ద టీడీపీ గూండాలు మోహరించి దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు.

మండల కేంద్రంలో బండిఆత్మకూ రులో గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సింగవరం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎలగాల బూరుగయ్య తన మద్దతు దారులతో నామినేషన్‌ దాఖలు చేయడానికి నామినేషన్‌ కేంద్రానికి చేరుకునే క్రమంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారులు దారి మధ్యలోనే అడ్డుకున్నారు. ‘నామినేషన్‌ ఎలా వేస్తావో.. చూస్తా’ అని బెదిరించారు. వారి మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టారు. ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు 29 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేశారు. 
 
నామినేషన్‌ పత్రం అపహరణ 
నంద్యాల(అర్బన్‌): కొలిమిగుండ్ల మండలం జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వచ్చిన  సుగుణమ్మ చేతిలో నుంచి గుర్తు తెలియని యువకుడు నామినేషన్‌ పత్రాన్ని లాక్కొని పరిగెత్తాడు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనను చూసి నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వారు అంతా అవాక్కయ్యారు. క్షణాల్లో జరిగిపోయిన ఈ సంఘటనకు పోలీసులు సైతం నివ్వెర పోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే కొలిమిగుండ్ల మండల జెడ్పీటీసీగా సుగుణమ్మ నామినేషన్‌ వేసేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకున్నారు.

పత్రాలు సంబంధిత పోలీసు అధికారికి చూపుతుండగా వెనుక వైపు నుంచి వచ్చిన ఓ యువకుడు పత్రాలు లాక్కొని అమాంతం పరిగెత్తాడు. పోలీసులు యువకుడిని వెంబడిస్తూ వెళ్లారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలో నామినేషన్‌ పత్రాన్ని లాక్కొని వెళ్లడం, పోలీసుల వైఫల్యమేనన్నా రు. ‘వారిదే ప్రభుత్వం ఉంది.. వారెందుకు భయపడతారు..  ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement