అల్లూరి జిల్లా కొయ్యూరు జెడ్పీటీసీగా నామినేషన్
సాక్షి, పాడేరు(అల్లూరి జిల్లా): అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి రెండున్నరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. కొయ్యూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా గురువారం పాడేరు ఐటీడీఏలో నామినేషన్ దాఖలు చేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే, గిరిజన ఉద్యమ నేత గొడ్డేటి దేముడు కుమార్తె అయిన మాధవికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ 2019లో అరకు ఎంపీగా పోటీచేసే అవకాశం కల్పించారు.
ఆ ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించి, 2019 నుంచి 2024 వరకు ఎంపీగా సేవలందించారు. తాజాగా.. కొయ్యూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లయింది. గతంలో ఎంపీగా పనిచేసిన మాధవి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో బరిలో నిలవడం కొయ్యూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: కలెక్టర్ నోట... ‘అసత్యాల’ మూట!!


