రాష్ట్రపతి, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ | Ysrcp Mp Gurumoorthy Letter To President And Cji Union Home Secretary | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ

Oct 23 2026 9:13 AM | Updated on Oct 23 2026 9:22 AM

Ysrcp Mp Gurumoorthy Letter To President And Cji Union Home Secretary

ఢిల్లీ: పక్షపాతంతో పనిచేస్తున్న డీఐజీ కోయా ప్రవీణ్‌, అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌ సహా పలువురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి,  డీవోపీటీ, గవర్నర్‌కు ఆయన లేఖ రాశారు.

పక్షపాతం తో పనిచేసినందుకు 2019 ఎన్నికలలో డీఐజీ కోయా ప్రవీణ్‌ను ఎన్నికల విధుల నుంచి ఈసీ తొలగించిందని గుర్తు చేసిన ఎంపీ గురుమూర్తి.. మళ్ళీ ఎన్నికల విధుల్లో నియమించడం నిబంధనల ఉల్లంఘనేనని.. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడం, పోలీసుల పక్షపాతం, సూపర్‌విజన్ వైఫల్యంపై స్వతంత్ర విచారణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

‘‘ఏపీ స్థానిక ఎన్నికల్లో పక్షపాతంతో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధులలో నుంచి తొలగించాలి. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై హింస, అడ్డుపడటం, భయపెడుతున్నారు. పుంగనూరులో రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కడప, అన్నమయ్య జిల్లాల్లోని పులివెందుల, కమలాపురం, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో వైఎస్ఆర్‌సీపీ నామినేషన్లు అడ్డుకున్నారు’’ అని లేఖలో గురుమూర్తి పేర్కొన్నారు.

‘‘పుంగనూరులో వైఎస్సార్‌సీపీ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కమలాపురంలో 47లో 46 టీడీపీ, బద్వేలులో చైర్మన్‌గా అందరూ టీడీపీ అభ్యర్థులే. ఎంపీపై డీఐజీ కోయా ప్రవీణ్‌ అవమానకర వ్యాఖ్యలు వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. 2019లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జీఓ ఆర్‌టి.815తో బదిలీ చేసిన డీఐజీ కోయా ప్రవీణ్‌ను మళ్లీ ఎన్నికల విధుల్లో నియమించడం నిబంధనల ఉల్లంఘన.

..డీఐజీ కోయా ప్రవీణ్‌, అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లపై కూడా ఎన్నికల విధుల నుంచి తొలగించాలి. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడం, పోలీసుల పక్షపాతం, సూపర్‌విజన్ వైఫల్యంపై స్వతంత్ర విచారణ చేయాలి. సీసీటీవీ, వీడియోలు, ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌లు సేకరించి విచారణ చేయాలి. అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలి’’ అని ఎంపీ గురుమూర్తి కోరారు.

ఇదీ చదవండి: ప్రా‘దేశం’ దమనకాండ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement