ఎల్లో మీడియాకు భయపడం : ఎమ్మెల్యే శ్రీదేవి

Tadikonda MLA Undavalli Sridevi Fires On Yellow Media - Sakshi

ఎల్లో మీడియాపై మండిపడ్డ ఎమ్మెల్యే శ్రీదేవి

సాక్షి, అమరావతి : ఎల్లో మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తుందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిజ నిజాలను తెలుసుకోకుండా ఎల్లో మీడియా ప్రసారం చేస్తుందని మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దళిత డాక్టర్ని అయిన తాను,  ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ట్యాప్‌ను డైలీ సీరియల్‌లా ఎల్లో మీడియా ఎలా ప్రసారం చేశారని ప్రశ్నించారు.
(చదవండి : మీ నీచ రాజకీయాలు రాష్ట్రం మొత్తం తెలుసు బాబూ)

చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో పట్టుబడినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు ప్రసారం చేయలేదని నిలదీశారు. ఏబీఎస్‌ రాధాకృష్ణ దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్పీ రేటింగ్‌ కోసం ఎల్లో మీడియా ఇంత దిగజారుతుందా అని అసహనం వ్యక్తం చేశారు. మునిగిపోతున్న టీడీపీ పార్టీని రాధాకృష్ణ బతికించాలని చూస్తున్నారని, కానీ అతని శ్రమ వ్యర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియాకు భయపడే రోజులు పోయాయని, ఇకనైనా అసత్య ప్రచారాలను నిలివిపేయాలని సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top